రాష్ట్రంలో కొత్తగా 57 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కొవిడ్ కేసుల సంఖ్య 2157కు చేరింది.
చిత్తూరు జిల్లాలో 14, నెల్లూరు 14, కృష్ణా 9, కర్నూలు 8, కడప 2, అనంతపురంలో 4 కేసులు నిర్ధరణ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఎటువంటి మరణాలు లేవని...60 మందిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం ఆస్పత్రిలో 857 మంది చికిత్స పొందుతున్నట్లు తెలిపింది.