గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 54 మందికి కొవిడ్ సోకినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కోత్త కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ బారినపడ్డ వారి సంఖ్య 8,88,814కి చేరిందని వెల్లడించింది.
ఏపీలో కొత్తగా 56 కరోనా కేసులు నమోదు
రాష్ట్రంలో కొత్తగా 54 మంది కరోనా బారినపడ్డట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నూతనంగా నమోదైన కేసులతో రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ బాధితుల సంఖ్య 8,88,814కి చేరింది.
ఏపీలో ప్రస్తుతం 797 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కరోనా కారణంగా ఎవరూ మృతి చెందలేదని తెలిపిన వైద్యారోగ్యశాఖ.. మహమ్మారి కారణంగా ఇప్పటివరకు 7,162 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో మరో 71 మంది కోవిడ్ నుంచి కోలుకోగా.. మెుత్తం కోలుకున్నవారి సంఖ్య 8,80,855కి చేరింది. ఇప్పటి వరకూ 1 కోటీ 35 లక్షల 17,440 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది.