AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 2,058 కరోనా కేసులు.. 23 మరణాలు
16:29 July 31
రాష్ట్రంలో మరో 21,180 ఆక్టివ్ కేసులు
రాష్ట్రంలో కొత్తగా 2,058 కరోనా కేసులు, 23 మరణాలు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 78,992 మంది నమూనాలు పరీక్షించగా 2,058 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 2,127 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 21,180 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్లో వెల్లడించింది. కొవిడ్ కారణంగా.. చిత్తూరు జిల్లాలో ఐదుగురు, కృష్ణా జిల్లాలో నలుగురు మృతి చెందగా.. నెల్లూరు, ప్రకాశంలో ముగ్గురు చొప్పున మరణించారు. తూర్పుగోదావరి, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతిచెందగా.. శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
ఇదీ చదవండి:
Kondapalli: కొండపల్లికి వెళ్లకుండా.. తెదేపా నేతల అరెస్ట్.. బలవంతంగా తరలింపు