ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్న ఆర్డీవో - rdo son

ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్ల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలనే డైలాగ్స్ చాలా సినిమాల్లో విని ఉంటాం. డైలాగ్ కొట్టడమే కాదు నిజం చేసి చూపించారు తెనాలి ఆర్డీవో రంగయ్య. తన కుమారుడ్ని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేర్చి అందరకీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

కొడుకు ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తోన్న ఆర్డీవో

By

Published : Jun 18, 2019, 10:56 PM IST

కొడుకు ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తోన్న ఆర్డీవో
ప్రభుత్వ ఉపాధ్యాయులే తమ పిల్లల్ని ప్రైవేటు పాఠశాల్లో చేర్పిస్తున్న రోజుల్లో...ముఖ్యమైన ప్రభుత్వ శాఖలో పనిచేస్తోన్న ఓ అధికారి తన కుమారుడుని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి స్పూర్తిదాయకంగా నిలిచారు. గుంటూరు జిల్లా తెనాలి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్​గా పనిచేస్తోన్న చెరుకూరి రంగయ్య తన కుమారుడు సిద్ధార్థను కొత్తపేటలోని రవి రంగయ్య మున్సిపల్ ఉన్నత పాఠశాలలో చేర్చారు.

విద్యార్థుల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని చెప్పడమే కాకుండా తాను ఆచరించి చూపారు ఆర్డీవో రంగయ్య. ప్రభుత్వ పాఠశాలపై సాధారణ ప్రజలకు నమ్మకం కలిగించడానికే తన కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించానన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన మెరుగుపడిందని...ప్రైవేటు సంస్థలతో పోటీపడుతున్నాయన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details