ఈనెల31న తెలుగుదేశం పార్టీ...విశాఖపట్నంలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది.పశ్చిమబంగా,దిల్లీ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ,అరవింద్ కేజ్రీవాల్ సభకు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.మరికొందరు జాతీయ స్థాయి నేతలూ పాల్గొనే అవకాశముంది.
31న విశాఖ తెదేపా సభకు మమత, కేజ్రీవాల్ - 31న విశాఖ తెదేపా సభకు మమత, కేజ్రీవాల్
ఈనెల 31న తెలుగుదేశం పార్టీ ...విశాఖపట్నంలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. పశ్చిమబంగ, దిల్లీ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ సభకు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. మరికొందరు జాతీయ స్థాయి నేతలు కూడా పాల్గొనే అవకాశముంది.

రాష్ట్రంలోనే అతిపెద్ద నగరమైన విశాఖపట్నంలో ఈ ఎన్నికల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పోటీ నెలకొంది.విశాఖపట్నం లోక్‌సభకి తెదేపా నుంచి దివంగత మాజీ ఎంపీ ఎం.వి.వి.ఎస్.మూర్తి మనమడు శ్రీభరత్,వైకాపా తరఫున సత్యనారాయణ,జనసేన నుంచి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ,భాజపా నుంచి కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి పోటీ చేస్తున్నారు.మొదటి నుంచీ ఉత్తరాంధ్ర తెదేపాకి కంచుకోట.ఇక్కడ పోలింగ్‌కి ముందు భారీ స్థాయిలో బల ప్రదర్శన చేయాలన్న ఉద్దేశంతో బహిరంగ సభ నిర్వహించబోతోంది తెదేపా.