ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

రోగిని చూడనివ్వలేదంటూ...బంధువులు ఆందోళన - patient

గుంటూరు కొత్తపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం రౌడీలతో దాడిచేయించిందని...రోగి బంధువులు ఆందోళనకు దిగారు. రోగిని చూడనివ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. లక్షలు ఖర్చుపెట్టిన సరైన చికిత్స అందించలేదని అంటున్నారు.

రోగిని చూడనివ్వలేదంటూ...బంధువులు ఆందోళన

By

Published : Jun 2, 2019, 11:12 AM IST

రోగిని చూడనివ్వలేదంటూ...బంధువులు ఆందోళన
రోగిన చూసేందుకు వచ్చిన తమపై ఆసుపత్రి యాజమాన్యం రౌడీలతో దాడి చేయిందని ఆరోపిస్తూ...రోగి బంధువులు ఆందోళనకు దిగారు. గుంటూరు కొత్తపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి ముందు రోగి బంధువులు బైఠాయించారు. ఈ ఆసుపత్రిలో చేరిన రోగికి 21 రోజులుగా వైద్యం అందిస్తున్నారన్న బంధువులు...అందుకుగాను మొత్తం రూ. 5లక్షల 60 వేలు బిల్లు వేశారన్నారు. వైద్యం చేస్తోన్న రోగి ఆరోగ్యం మెరుగవ్వలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇంటికి పంపించాలని కోరితే...ఇంకా అదనపు బిల్లు చెల్లించాలని ఆసుపత్రి యాజమాన్యం డిమాండ్ చేసిందన్నారు. డబ్బు చెల్లించే వరకు రోగిని చూడనివ్వమని బెదిరిస్తూ...తమపై రౌడీలతో దాడిచేయించారని రోగి బంధువులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని, విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details