అనంతపురం జిల్లాలో హనుమాన్ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కదిరిలోని హన్మాన్ ఉప సమితి ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టింది. అనంతపురంలోని పలు దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. పంచామృతాభిషేకం, యాగాలు, మహా మంగళ హారతి కార్యక్రమాలకు విశేష జనవాహిని హాజరైంది. పెనుకొండలో ఉదయం నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు అట్టహాసంగా ప్రారంభించారు. వడమాలలతో హనుమ విగ్రహాలను అలంకరించి పూజించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు.
అనంతలో అట్టహాసంగా ఆంజనేయ జయంతి - ap latest
అనంతపురం జిల్లాలో ఆంజనేయుని జయంతి అట్టహాసంగా జరిగింది. కదిరిలో హనుమాన్ ఉప సమితి ద్విచక్రవాహన ర్యాలీ చేపట్టింది. అనంతపురంలోని ఆలయాల్లో జరిగిన పూజలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. పెనుకొండలో వడమాలలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.

అట్టహాసంగా ఆంజనేయ జయంతి
అనంతలో ఆంజనేయ జయంతి
ఇవీ చదవండి...పంచముఖ ఆంజనేయునికి పాలాభిషేకం