ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఏకపక్షం..ఈసీ తీరు...విమర్శల జోరు..! - ec-ap-elections

ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ద వ్యవస్థ.. నిష్పాక్షపాతంగా, ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికలు నిర్వహించడం ఈసీ బాధ్యత. కానీ ఈసారి ఏం జరిగింది? విపక్షం ఫిర్యాదు చేయటం, వెంటనే ఈసీ బదిలీలు చేయటం..? ఎక్కుడుంది.. హేతుబద్దత.. ? ఏమైంది నిస్పాక్షికత..? ఎన్నికల సంఘం పక్షపాతంతో వ్యవహరిస్తోందన్న తెలుగుదేశం పార్టీ అరోపణలకు బలం చేకూర్చేలా ఈసీ వ్యవహరించింది. ఎన్నికల సంఘం తీరుపై ముఖ్యమంత్రి ధర్నా చేసేవరకూ .. పరిస్థితి వెళ్లింది.

ec-yekapaksham

By

Published : Apr 13, 2019, 12:57 PM IST

Updated : Apr 13, 2019, 1:27 PM IST

ఏకపక్షం..ఈసీ తీరు...విమర్శల జోరు..!

అడ్డగోలు బదిలీలు.....

రాష్ట్రఎన్నికల్లో ప్రధానపార్టీల ప్రచారం,మాటల తూటాలతో పాటు అందరి దృష్టి నెలకొన్న అంశమేదైనా ఉందంటే...ఉన్నతాధికారుల బదిలీలకు సంబంధించే.ఎన్నికల షెడ్యూల్‌కు ముందే..సీఈఓ సిసోడియా చురుగ్గా వ్యవహరించలేకపోతున్నారంటూ బదిలీ చేసిన ఈసీ ఆ స్థానంలో గోపాల కృష్ణ ద్వివేదిని నియమించింది.షెడ్యూల్‌ తర్వాత కడప,శ్రీకాకుళం ఎస్పీ లు,నిఘా విభాగం అధిపతిని పక్కనపెట్టింది.తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినే బదిలీ చేశారు. 48గంటల్లో పోలింగ్‌ ఉందనగా ప్రకాశం జిల్లా ఎస్పీని బదిలీ చేసింది ఈసీ.కిందిస్థాయిలో సీఐలు,ఇతర పోలీస్‌ సిబ్బందిని బదిలీ చేస్తూ నిర్ణయాలు తీసుకుంది.

ఎన్నికల సందర్భంలో వారి నిర్ణయాలను ఎవరూ ప్రశ్నించలేరు.అది నిజమే అయినా.రాష్ట్రంలో అధికారులను బదిలీ చేసిన సమయం,ఆధారంగా చేసుకున్న ఫిర్యాదులు,అవి చేసిన వ్యక్తులు,వాటికి ఇచ్చిన ప్రాధాన్యత,స్పందించిన వేగమే చర్చకు కారణమైంది.అదే విషయంపై అధికార తెలుగుదేశం ఈసీ కేంద్రం కనుసన్నల్లో పనిచేస్తోందని ఆరోపిస్తోంది.ముఖ్యమంత్రి,తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఈ విషయంపై మొదట్నుంచీ ఈసీ తీరుపై తీవ్ర విమర్శలే చేస్తున్నారు.

మొదటి నుంచీ ఇంతే..

ఈ ఫిర్యాదులు బదిలీల పరంపర చూస్తే...ఫిబ్రవరి3న ఓట్ల తొలగింపు,సాధికార సర్వే,ఆర్ టీ జీ ఎస్ ద్వారా సేకరించిన వివరాలు రాష్ట్రప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందంటూ ఈసీకి ఫిర్యాదు చేసింది...విపక్ష వైకాపా.పోలీస్‌శాఖలో పదోన్నతుల్లో ఒకే సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇచ్చారు అనీ ఫిర్యాదు చేశారు.కొద్దిరోజులాగి మార్చి25న తమ ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారంటూ మరోసారి ఈసీకి ఫిర్యాదు చేశారు వైకాపా నేతలు.వెంటనే మార్చి26న ఐబీ ఛీఫ్‌బదిలీ ఉత్తర్వులు ఇచ్చింది ఈసీ.కడప ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ,శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం పైనా బదిలీ వేటు వేసింది.

సీఎస్ బదిలీ....

నిఘా విభాగాధిపతి విషయంలో ఈసీ తీరుతో విబేధిస్తూ రాష్ట్రప్రభుత్వం జారీ చేసినజీఓలు ,హైకోర్టులో విచారణ సందర్భంగా మార్చి28, 29తేదీల్లో చోటు చేసుకున్న పరిణామాలు వాతావ రణాన్ని ఇంకా వేడిగా మార్చాయి.తమ ఆదేశాలు పాటించటంలో అలసత్వం వహించారంటూ..ఏప్రిల్‌5న ఏకంగా ఈసీ అనిల్‌చంద్ర పునేఠానే బదిలీ చేసింది ఈసీ.ఆయన దిల్లీ వెళ్లి వివరణ ఇచ్చినా..సంతృప్తి చెందలేదు.ఆ స్థానంలో ఎల్వీ సుబ్ర మణ్యాన్ని సీఎస్ గా నియమించింది.దానికి4రోజుల వ్యవధిలోనే ఏప్రిల్‌9న ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్‌ను..మంగళగిరి,తాడేపల్లి సీఐల బదిలీ చేసింది.ఈ ప్రతి నిర్ణయాన్నీ తెలుగుదేశం తీవ్రంగా తప్పుబడుతోంది.

చంద్రబాబు ధర్నా....

ఇవన్నీ ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాలని ఏప్రిల్‌10న సీఈసీకే లేఖ రాశారు చంద్ర బాబు.ప్రకాశం జిల్లా ఎస్ పీ కోయ ప్రవీణ్‌ బదిలీ....పోలీసు శాఖకు తప్పుడు సంకేతాలు పంపిందన్న సీఎం...ఫారం-7పేరుతో నకిలీ దరఖాస్తులు చేసినవారిపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.అధికారుల వివరణకి అవకాశం ఇవ్వకుండా... 31క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న ప్రతిపక్ష నేత ఆరోపణలకు ప్రాధాన్యమిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.తెదేపా నేతల ఇళ్లలో ఐటీ దాడుల వెనక కుట్ర దాగి ఉందన్న ఆయన...రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం వద్ద బైఠాయించి మరీ నిరసన తెలిపారు.

ఆరోపణలకు బలం...

ఈ వివాదంలో తెలుగుదేశం అభ్యంతరాలు,ఈసీపై విమర్శలకు బలం చేకూర్చేలా కొన్ని కీలక అంశాలు ప్రస్తావిస్తోంది...ఆ పార్టీ.సోమవారం సిఇసిని కలుస్తా,మంగళవారం నిఘా విభాగాధిపతిమారిపోతారని విజయసాయి రెడ్డి చెప్పటం,అలాగే జరగటం దేనికి సంకేతమని అడు గుతోంది.ఈసీకి వైసీపీ ఫిర్యాదులో పేర్కొన్నట్లే యథాతథంగా..హైదరాబాద్‌లో ఐటీ గ్రిడ్స్‌కేసు కదలటంపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇదే సమయంలో తెదేపా ఏ ఒక్క ఫిర్యాదుపై ఈసీ చర్యలు తీసుకోకపోవటం ఏమిటని ప్రశ్నిస్తోంది.

తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకూ150ఫిర్యాదులు ఇచ్చినా ఈసీ స్పందించలేదని,వైకాపా ఫిర్యాదు చేయగానే చర్యలకు ఉపక్రమిస్తున్నారన్నదే ప్రధాన ఆరోపణ.మరీ ముఖ్యంగా ఫారం-7వివాదం,రాష్ట్ర పోలీస్‌శాఖపై పరిశీలకుడిగా కేకే శర్మ నియామకంపై తెదేపా మొదట్నుంచీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.కెకె శర్మను తొలుత పశ్చిమబంగ పంపించారని,ఆర్ ఎస్ ఎస్ మూలాలున్న వ్యక్తి అని..అక్కడంతా వ్యతిరేకించటంతో తెచ్చి ఆంధ్రలో పెట్టారని ఆరోపించారు.ఫారం-7దరఖాస్తులపై సిట్‌ ఐపీ చిరునామాల కోసం ఈసీకి లేఖరాస్తే ఇప్పటివరకూ ఎందుకు స్పందించలేదనే ప్రశ్నలకూ సమాధానం లేదు.

కడప జిల్లాలో వివేకానందరెడ్డి హత్య జరిగితే,తొలుత గుండెపోటుగా ప్రచారం చేశారని,తర్వాత సాక్ష్యాలను చెరిపేశారని తెదేపా నేతలు ఆరోపించారు.పోస్ట్‌మార్టంలో హత్యగా తేలిన తర్వాత హంతకులను కాపాడేందుకు వైకాపా నేతలు ప్రయత్నించారని దుయ్యబట్టారు.అలాంటి పరిస్థితుల్లో వైకాపా ఈసీ కి ఫిర్యాదు చేయగానే కేసు దర్యాప్తు చేస్తున్న కడప ఎస్పీనే మార్చడాన్ని తెదేపా తప్పుపట్టింది.ప్రకాశం జిల్లా ఎస్పీ బదిలీ అవుతారని ఉదయం చీరాల వైకాపా అభ్యర్థి చెప్పారని,సాయంత్రానికి ఆయన బదిలీ అయ్యారంటే ఏమనుకోవాలని ప్రశ్నిస్తోంది.

వైకాపాపై చర్యలు లేవు...

అలానే ఎన్నికలకు ముందు,ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత కేవలం తమపార్టీ నాయకులు,అభ్యర్థులపైనే ఆదాయపు పన్ను శాఖ దాడులేంటని తెదేపా నిలదీసింది.గల్లా జయదేవ్‌ ఆడిటర్‌పై ఐటీ దాడిని తప్పు పట్టింది.తెలంగాణలో భాజపా నాయకు డు లక్ష్మణ్‌ సహాయకుడి వద్ద8కోట్ల రూపాయలు దొరికిందని బ్యాంకు నుంచి డ్రా చేశారని ఆయనపై ఎలాంటి చర్యలు లేవని నిలదీసింది.ఆళ్లగడ్డలో వైకాపా నాయకులు డబ్బులు వెదజల్లితే,శ్రీకాకుళం జిల్లాలో వైకాపా అభ్యర్థి రెడ్డి శాంతి సోదరుడు డబ్బులతో పట్టుబడితే చర్యలు లేవని ప్రశ్నించింది.ఈ మొత్తం పరిణామాలపై తెదేపా నేతలు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా,కమిషనర్లతో భేటీ అయ్యి ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిన లేఖ అందజేశారు.ఈసీపై వైకాపా నేతలు చేసిన వ్యాఖ్యల ఆడియో రికార్డింగులను ఇచ్చారు.

మొత్తంగా చూస్తే...అధికారుల నుంచి వివరణ తీసుకోకుండా ఎలా బదిలీలు చేస్తారు..తీవ్ర నేరాభియోగాలు ఎదుర్కొంటున్న ఓ పార్టీ చేస్తున్న ఫిర్యాదుల ఆధారంగా చర్యలు ఏంటనేవి ఈసీ కి తెదేపా సూటి ప్రశ్నలు.సీఈసీ చర్యలు తీసుకోమంటే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారైనా అవి సరైనవా కాదో పరిశీలించాలి కదా అని నిలదీస్తోంది.ఉదయం వైకాపా నాయకులు చెబితే సాయంత్రానికి అధికారులు బదిలీ అవుతున్నారన్న విమర్శ లకు తగ్గట్టే నిర్ణయాలు ఉండటాన్ని ఆక్షేపిస్తోంది.దేశవ్యాప్తంగా66మంది విశ్రాంత ఐఏఎస్,ఐపీఎస్,ఐఎఫ్ఎస్ అధికారులు ఈసీవి ఏకపక్ష చర్యలని తప్పుబడుతూ రాష్ట్రపతికి ఫిర్యాదు చేయటం ఈ వివాదంలో కొసమెరుపు అనుకోవ చ్చు.

Last Updated : Apr 13, 2019, 1:27 PM IST

ABOUT THE AUTHOR

...view details