ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

జగన్​, చంద్రబాబులకు కేంద్రమంత్రి లేఖ... ఎందుకంటే?

వైకాపా అధినేత, ఏపీ సీఎం​ జగన్​, తెదేపా అధినేత చంద్రబాబుకు కేంద్రమంత్రి లేఖ రాశారు. పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలతో జరిగే సమావేశానికి రావాలని ఆహ్వానించారు.

జగన్​, చంద్రబాబులకు కేంద్రమంత్రి లేఖ... ఎందుకంటే?

By

Published : Jun 16, 2019, 1:39 PM IST

Updated : Jun 16, 2019, 4:02 PM IST

వైకాపా అధినేత, ఏపీ సీఎం జగన్‌, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి లేఖ రాశారు. పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీల అధ్యక్షులతో కేంద్రం ప్రత్యేక సమావేశమవుతోందని అందులో పేర్కొన్నారు. ఆ సమావేశానికి రావాలని ఆహ్వానించారు. 5 లక్ష్యాల సాధన కోసం అన్ని పార్టీల అధ్యక్షులతో చర్చిస్తున్నట్టు లేఖలో వివరించారు. పార్లమెంట్‌ ఔన్నత్యాన్ని పెంపొందించేందుకు చర్యల అంశంపై తొలి ప్రాధాన్యాంశంగా తీసుకున్నట్టు వెల్లడించారు.


కేంద్రం పేర్కొన్న ఐదు ప్రాధాన్యాంశాలు
1. పార్లమెంటు ఔన్నత్యాన్ని పెంపొందించేందుకు చర్యలు
2. ఒక దేశం ఒకే ఎన్నికలు
3. 75 ఏళ్ల స్వాతంత్య్రం సందర్భంగా నవభారత నిర్మాణం
4. మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకల నిర్వహణ
5. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి
ఈ అంశాలపై చర్చించేందుకు రావాలని వైకాపా, తెలుగుదేశం సహా దేశంలోని చాలా పార్టీల అధినేతలకు కేంద్రం లేఖలు రాసింది.

Last Updated : Jun 16, 2019, 4:02 PM IST

ABOUT THE AUTHOR

...view details