ఏపీ ఎంసెట్ 2019 ఫలితాల విడుదలకు అధికారులు సన్నాహాలు పూర్తి చేశారు. ప్రభుత్వ అనుమతితో ఎంసెట్ ఫలితాలను ఈ రోజు ఉదయం 11.30 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ ఇంటర్ మార్కుల జాప్యం కారణంగా ఎంసెట్ ఫలితాల విడుదల ఆలస్యమైందని వివరించారు. తెలంగాణకు చెందిన 36వేల మందికి పైగా విద్యార్థులు ఏపీ ఎంసెట్ రాశారు. ర్యాంకుల కేటాయింపులో ఇంటర్ మార్కులు పరిగణలోకి తీసుకుంటారు. ఇంటర్ మార్కులకు ఎంసెట్‌లో 25% వెయిటేజీ ఉంటుంది. ఏపీ ఎంసెట్ పరీక్షను మొత్తం 2,82,901 మంది విద్యార్థులు రాశారు. ఇంజినీరింగ్లో ప్రవేశానికి 1 లక్షా 85 వేల 711 మంది.. వ్యవసాయ, వైద్య విద్య పరీక్షకు 81 వేల 916 మంది హాజరయ్యారు.
ఇవాళే ఎంసెట్ ఫలితాలు.. ఎదురు చూపుల్లో విద్యార్థులు - ఏపీ ఎంసెట్ 2019
ఏపీ ఎంసెట్ - 2019 ఫలితాలు ఇవాళ ఉదయం 11.30 గంటలకు విడుదలకానున్నాయి. ఫలితాల విడుదలకు ప్రభుత్వం అనుమతితో.. అధికారులు సన్నాహాలు పూర్తి చేశారు.

eamcet results
ఇవీ చూడండి : రాష్ట్రంలో తెలుగును పాలనాభాషగా అమలుచేయాలి: యార్లగడ్డ
Last Updated : Jun 3, 2019, 11:59 PM IST