ప్రభుత్వ ఆదాయం పెరిగిన కొద్ది రైతులకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని నెలకు రూ.500 మేర పెంచనున్నట్లు సంకేతాలిచ్చారు కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ. ఈ నిధులను రైతులకు ఆదాయం సమకూరేందుకు రాష్ట్రాలు అమలు చేస్తున్న వివిధ పథకాలకు జోడించి వాడుకోవచ్చన్నారు జైట్లీ.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపైనా విమర్శలు కురిపించారు జైట్లీ. పోటీ చేస్తున్నది కళాశాల ఎన్నికలకు కాదని రాహుల్ గుర్తించాలన్నారు. జాతీయ స్థాయికి తగ్గట్టు ఆయన ప్రవర్తించాలని ఎద్దేవా చేశారు.