national

By ETV Bharat Telangana Team

Published : Sep 24, 2024, 4:41 PM IST

ETV Bharat / snippets

జానీ మాస్టర్‌ను 5రోజుల కస్టడీకి కోరిన నార్సింగి పోలీసులు - తీర్పు రేపటికి వాయిదా

JOHNNY MASTER CUSTODY ISSUE
JOHNNY MASTER PETITION POSTPONED (ETV Bharat)

JOHNNY MASTER PETITION IN THE COURT:సహాయ కొరియోగ్రాఫర్​పై లైంగిక దాడి కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్​పై తీర్పును కోర్టు రేపటికి వాయిదా వేసింది. కేసులో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి జానీ మాస్టర్​ను 5రోజుల కస్టడీ కోరుతూ నార్సింగి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. నేడు ఇరు పక్షాల వాదనలు విన్న రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పును రేపటికి రిజర్వ్ చేసింది. మరోవైపు తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా జానీ మాస్టర్ పిటిషన్ దాఖలు చేయగా, దీనిపై కూడా రేపు కోర్టు వాదనలు విననుంది. అత్యాచారం కేసులో ఈనెల 19న గోవాలో జానీ మాస్టర్​ను అరెస్ట్ చేయగా కోర్టు అతనికి 14రోజుల రిమాండ్ విధించింది. రేపు న్యాయస్థానం కస్టడీ పిటిషన్, బెయిల్ పిటిషన్​పై తన నిర్ణయం ప్రకటించనుంది.

ABOUT THE AUTHOR

...view details