national

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 12, 2024, 7:45 PM IST

ETV Bharat / snippets

మంటల్లో నీటిపారుదల శాఖ ఫైళ్లు- ప్రమాదమా? ప్రణాళికలో భాగమా?

Fire Accident at Irrigation Development Office
Fire Accident at Irrigation Development Office (ETV Bharat)

Fire Accident at Irrigation Development Office: విజయవాడలో నీటిపారుదల అభివృద్ధి కార్యాలయంలో గురువారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో కార్యాలయంలోని కీలకమైన ఫైళ్లు కాలిపోయాయి. కంప్యూటర్లు, రికార్డులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఎలుకలు విద్యుత్‌ తీగలు కొరకడం వల్లే అగ్నిప్రమాదం సంభవించినట్లు కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. ప్రమాద ఘటనపై అధికారులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. వారం రోజులు నుంచి ఫైళ్లు ఆఫీస్ దాటుతున్నాయని ఫిర్యాదులు చేశారు. ఉద్దేశపూర్వకంగా చేశారా లేక ప్రమాదమా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details