national

By ETV Bharat Telangana Team

Published : Jul 9, 2024, 5:17 PM IST

ETV Bharat / snippets

మన్యంలో కంటెయినర్ ఆసుపత్రి - గిరివాసులు వైద్య సేవలకై కలెక్టర్ వినూత్న ఆలోచన

Mulugu District Collector TS Diwakara
Container Hospital in Mulugu District (ETV Bharat)

Container Hospital in Mulugu District : మన్యం ప్రాంతం వాసులకు అత్యవసర సమయంలో వైద్య సేవలు అందించేందుకు ములుగు జిల్లా కలెక్టర్ వినూత్న ఆలోచన చేశారు. మన్యంలో ప్రతి ఏటా సీజనల్ వ్యాధులు ప్రబలుతుండడంతో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. రవాణా సౌకర్యం లేక వైద్య సిబ్బంది సరైన సమయంలో అందించక ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులను అధిగమించి గిరివాసులకు వైద్య సేవలందించేందుకు ములుగు కలెక్టర్ టీఎస్ దివాకర రాష్ట్రంలోనే తొలిసారి ఓ వినూత్న ప్రయోగం చేశారు.

కంటెయినర్ రూపంలో అదనపు ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఏర్పాటు చేసి సేవలం దించాలని నిర్ణయించారు. జాతీయ రహదారికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ములుగు జిల్లా ప్రజలు వైద్యం కోసం దూరప్రాంతాలకు వెళ్తుంటారు. ఇవన్నీ చూసిన కలెక్టర్​ నాలుగు పడకల కోసం సుమారు రూ.7 లక్షల వ్యయంతో దీన్ని రూపొందించారు. ఈ వైద్య సేవలను వారంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details