national

By ETV Bharat Telangana Team

Published : Aug 18, 2024, 12:36 PM IST

ETV Bharat / snippets

ఆడుకుంటుండగా కూలిన నిర్మాణంలో ఉన్న గోడ - తమ్ముడు మృతి, అన్న పరిస్థితి విషమం

A Child Died After a Wall Collapsed in Suryapet
A Child Died After a Wall Collapsed in Suryapet (ETV Bharat)

A Child Died After a Wall Collapsed in Suryapet District : సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్‌ మండలం నెమ్మికల్‌ వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న వంతెన గోడ కూలి మూడేళ్ల చిన్నారి మృతి చెందాడు. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. ఆలయం వద్ద అన్నదమ్ములు ఆడుకుంటుండగా అకస్మాత్తుగా గోడ కూలడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

దండు మైసమ్మ ఆలయం వద్ద జరిగిన ఈ ఘటన బాధిత తల్లిదండ్రులకు పుత్ర శోకం మిగిల్చింది. ఈ ప్రమాదంలో తమ్ముడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, అన్న పరిస్థితి విషమంగా ఉంది.

ABOUT THE AUTHOR

...view details