national

By ETV Bharat Telangana Team

Published : Jun 14, 2024, 2:28 PM IST

ETV Bharat / snippets

పుట్టిన 52రోజులకే ఆధార్ కార్డు - ఆ చిన్నారికి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు

Aadhaar Holder in International Book of Records
Aadhaar Holder in International Book of Records (ETV Bharat)

Nizamabad Kid International Record : పుట్టిన 52రోజులకే ఆ చిన్నారి ఆధార్ కార్డు పొంది అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. నిజామాబాద్‌కు చెందిన అనూష, అన్వేష్ దంపతుల కుమార్తె ఆద్య అతిచిన్న వయసులోనే ఈ ఘనతను సొంతం చేసుకుంది. దీంతో ఆ పాప ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. అంతర్జాతీయ స్థాయిలో తమ కుమార్తె గుర్తింపు తెచ్చుకోవడం పట్ల చిన్నారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది తమకు గర్వంగా ఉందని చెబుతున్నారు. ఈ సందర్భంగా వీరిని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details