తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Sep 26, 2024, 12:33 PM IST

ETV Bharat / snippets

ఏడు సర్జరీలు దాటి- రూ.7 కోట్ల ప్రశ్నకు తడబడి! KBCలో రూ.కోటి గెలుచుకున్న యువకుడు

KBC Season 16 One Crore Winner
KBC Season 16 One Crore Winner (ANI)

KBC Season 16 One Crore Winner :కౌన్‌ బనేగా కరోడ్‌పతి 16వ సీజన్​లో చంద్రప్రకాశ్​(22) ఏకంగా రూ.కోటి గెలుచుకుని సంచలనం సృష్టించాడు. ఈ సీజన్‌లో రూ.కోటి గెలిచిన తొలి కంటెస్టెంట్‌ ఇతడే కావడం విశేషం. అయితే, రూ.7 కోట్ల ప్రశ్నకు కూడా సమాధానం తెలిసినప్పటికీ, రిస్క్‌ తీసుకోకుండా గేమ్‌ నుంచి క్విట్‌ అయ్యాడు. 22 ఏళ్ల ప్రకాశ్ స్వస్థలం జమ్ముకశ్మీర్‌. ప్రస్తుతం యూపీఎస్​సీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. చిన్నప్పటి నుంచి తాను ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నానని, పేగులో పూడిక కారణంగా ఇప్పటివరకు ఏడు సార్లు సర్జరీ చేయించుకున్నానని చెప్పాడు.

ABOUT THE AUTHOR

...view details