Rajya Sabha By Polls Results 2024 :రాజ్యసభ ఉప ఎన్నికల్లో 12 స్థానాలు కూడా ఏకగ్రీవమయ్యాయి. 9 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 12 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 21వరకు నామినేషన్లు స్వీకరించగా, తొమ్మిది స్థానాల్లో బీజేపీ, రెండు స్థానాల్లో ఆ పార్టీ మిత్రపక్షాలైన ఎన్సీపీ, ఆర్‌ఎల్‌ఎం అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరోవైపు, తెలంగాణ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
రాజ్యసభ ఉపఎన్నికల్లో 12మంది ఏకగ్రీవ ఎన్నిక- మెజార్టీ మార్క్ తాకిన NDA
Rajya Sabha (Getty Images)
Published : Aug 27, 2024, 8:29 PM IST
ఎన్డీఏకు ఎగువ సభలో మెజార్టీ మార్కును అందుకుంది. తాజాగా రాజ్యసభలో బీజేపీ బలం 96కి చేరగా, మిత్రపక్షాలతో కలిపి ఎన్డీఏ ఆ బలం 112గా ఉంది. దీనికితోడు అధికార పార్టీకి ఆరుగురు నామినేటెడ్, ఒక స్వతంత్ర సభ్యుడి మద్దతు కూడా ఉంది. తాజాగా కాంగ్రెస్ నుంచి ఒక సభ్యుడు గెలుపొందడం వల్ల రాజ్యసభలో ప్రతిపక్షాల బలం 85కి పెరిగింది.