బీజేపీ ముస్లిం వ్యతిరేక పార్టీ- రాష్ట్రాభివృద్ధి కోసమే జగన్ చెలిమి: ఎమ్మెల్యే రాచమల్లు - బీజేపీ ముస్లిం వ్యతిరేక పార్టీ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 29, 2024, 1:53 PM IST
YSRCP MLA Rachamallu Comments on BJP Government: భారతీయ జనతా పార్టీపై (BJP) వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే (YSRCP MLA Sivaprasad Reddy) రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని అన్ని కులాలు, మతాలకు సమాన అవకాశాలను బీజేపీ కల్పించలేక పోయిందని శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ ముస్లింలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని, మతతత్వ పార్టీ అని రాచమల్లు ఆరోపించారు.
BJP Muslim Against Party: బీజేపీలోకి వైఎస్సార్సీపీని ఆహ్వానించినా రాష్ట్రంలోని ముస్లిం సోదరుల కోసం సీఎం జగన్ ఆ పార్టీతో పొత్తు (Alliance) పెట్టుకోలేదని రాచమల్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఇబ్బందులు వల్ల అనేక సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఉన్నా బీజేపీతో వైఎస్సార్సీపీ పొత్తు పెట్టుకోలేదని రాచమల్లు తెలిపారు. జగన్కు నష్టం వాటిల్లుతుందని తెలిసినా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలకలేదని, రాష్ట్రానికి రావలసిన నిధుల కోసమే బీజేపీతో జగన్ చెలిమిని కొనసాగిస్తున్నారని వారితో అంటకాగలేదని రాచమల్లు స్పష్టం చేశారు.