నిమ్మతోట నరికేసిన వైఎస్సార్సీపీ నేత - సీఎం చంద్రబాబు ఆగ్రహం - CBN React YSRCP Leader Behaviour - CBN REACT YSRCP LEADER BEHAVIOUR
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 16, 2024, 4:01 PM IST
|Updated : Jul 16, 2024, 10:00 PM IST
YSRCP Leader Cut Lemon Trees in Farmer Field : అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం పోలి గ్రామంలో వైఎస్సార్సీపీ శ్రేణులు రెచ్చిపోయారు. రామచంద్రారెడ్డి అనే వైఎస్సార్సీపీ నాయకుడు మరి కొంతమందితో కలిసి ఓ రైతు పొలంలోని నిమ్మ చెట్లు నరికేశాడు. రామచంద్రారెడ్డి గత కొంతకాలంగా తన 5.60 ఎకరాల భూమిని ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నాడని బాధితుడు తెలిపారు. వైఎస్సార్సీపీ నేత నిమ్మచెట్లు నరికేస్తానని మూడు రోజులుగా తమను బెదిరించాడని బాధితుడు వివరించారు.
సోమవారం రాత్రి తన మనుషులతో కలిసి రామచంద్రారెడ్డి 430 నిమ్మ చెట్లను నరికేశాడని మ ఆవేదన వ్యక్తం చేశారు. తన భూమిలో చెట్లను నరికేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధిత రైతు రాజంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము 2015లో భూమిని కొనుగోలు చేశానని బాధితుడు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితుడి పొలంలో నరికేసిన చెట్లను పరిశీలించారు. చెట్లను నరికేసిన రామచంద్రారెడ్డి వారి కుమారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడి కుటుంబ సభ్యులు కోరారు.
నిమ్మచెట్ల నరికివేతపై చంద్రబాబు ఆగ్రహం: నిమ్మచెట్ల నరికివేత ఘటనను సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. పంట పొలాలను ధ్వంసం చేయడం, తోటలను నరికివేయడం లాంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని చంద్రబాబు అన్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రౌడీ రాజకీయాలు, విధ్వంస విధానాలకు పాల్పడే వారు తీరు మార్చుకోకపోతే మూల్యం చెల్లించాలని చంద్రబాబు హెచ్చరించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.