ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఆర్టీసీ బస్సులో యువకుడి వీరంగం- మహిళా కండక్టర్‌కు బెదిరింపులు - Youth Halchal in RTC Bus - YOUTH HALCHAL IN RTC BUS

🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 18, 2024, 12:05 PM IST

Youth Abused Woman Conductor in RTC Bus : మద్యం సేవించి ఆర్టీసీ బస్సు ఎక్కిన ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా కంకిపాడు వద్ద జరిగింది. ఆర్టీసీ బస్సు ఎక్కి మహిళా కండక్టర్​పై యువకుడు దుర్భాషలాడాడు. మద్యం తాగిన అతను కంకిపాడు వద్ద బస్సు ఎక్కాడు. యువకుడు టికెట్టు తీసుకోకపోవడంతో మహిళా కండక్టర్ అతడిని ప్రశ్నించింది. దీంతో ఆమెపై దురుసుగా ప్రవర్తిస్తూ వీరంగం సృష్టించాడు. 

అడ్డుకోబోయిన బస్సు డ్రైవర్‌ను సైతం బూతులు తిడుతూ బెదిరించాడు. 30 నిమిషాలకుపైగా బస్సు ఆపిన యువకుడు టిక్కెట్టు తీసుకోకుండా చిల్లర ఇవ్వలేదని కండక్టర్​తో వాదించాడు. దీంతో కండక్టర్ శ్రీలత యువకుడిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి వస్తున్నారని తెలిసి ఆ యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ యువకుడి గురించి వివరాలు ఏమి తెలియరాలేదు. ఈ ఘటనపై దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించనున్నట్లు తెలుస్తుంది.     

ABOUT THE AUTHOR

...view details