ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రెడ్డి శాంతికి టికెట్‌ వద్దు - ఇస్తే ఓడించడానికి 'సిద్ధం' : వైఎస్సార్సీపీ నేతలు - YCP leaders Meeting in Kothur

🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 6, 2024, 9:27 PM IST

YCP Leaders Meeting Against of MLA Reddy Shanthi : శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం వైఎస్సార్సీపీలో అసమ్మతి మరోసారి బహిర్గతమైంది. ఎమ్మెల్యే రెడ్డి శాంతికి వ్యతిరేకంగా కొత్తూరులో వైసీపీ అసమ్మతి వర్గీయులు సమావేశం అయ్యారు. స్థానిక వైసీపీ నాయకుడు తులసి వరప్రసాద్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రెడ్డి శాంతి పోకడలపై విమర్శలు గుప్పించారు. పాతపట్నం నియోజకవర్గానికి సంబంధించి అధిష్ఠానం ఆలోచించి టికెట్ ఇవ్వాలన్నారు. అన్ని విధాలుగా విచారణ చేసి స్థానిక నాయకుడికి టికెట్ ఇవ్వాలని కోరారు. అలా కాదని మళ్లీ రెడ్డి శాంతికి టికెట్‌ ఇస్తే తామంతా కలసి ఆమెను ఓడించడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.

రెడ్డి శాాంతి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని మండిపడ్డారు. అంతేగాక ఆమె వైఖరి కారణంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తికి టికెట్ ఇస్తే మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details