ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మహిళపై వైఎస్సార్సీపీ నేత అరాచకం - ఇంటి అద్దె చెల్లించమన్నందుకు భౌతిక దాడి - woman Assault asking of house rent

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 2, 2024, 4:24 PM IST

Woman Assault by YSRCP Followers at Mangalagiri: అధికార పార్టీ నేత అండ చూసుకుని ఓ వైఎస్సార్సీపీ నాయకుడు దౌర్జన్యానికి తెగబడ్డాడు. మహిళ అని కూడా చూడకుండా, ఇంటి అద్దె కట్టమని అడిగిన యజమానురాలుపై కుటుంబంతో కలిసి ఆమెపై భౌతిక దాడికి పాల్పడ్డారు. ఇళ్లు ఖాళీ చేయమంటే తిరిగి తమనే డబ్బులు ఇవ్వాలని దౌర్జన్యం చేస్తున్నారని బాధితురాలు ఆరోపించారు. 

Asking Of House Rent: గుంటూరు జిల్లా మంగళగిరిలో వైఎస్సార్సీపీ నేత, న్యాయవాది కొసనం శ్రీనివాసరావు తమ ఇంట్లో ఉంటూ దౌర్జన్యానికి తెగబడ్డారని బాధితురాలు సౌజన్య తెలిపారు. తమ ఇంట్లో అద్దెకు ఉంటూ, ఇంటి అద్దె అడిగేందుకు వెళ్తే తనపై శ్రీనివాసరావు దాడికి పాల్పడ్డారని, ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డానని బాధితురాలు పేర్కొన్నారు. ఐదు నెలలుగా అద్దె డబ్బులు చెల్లించటం లేదని, ఈ క్రమంలో నిన్న అద్దె అడిగేందుకు వెళ్లిన సమయంలో తనపై దాడి చేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లు ఖాళీ చేయాలంటే లక్ష రూపాయిలు ఇవ్వాలని దౌర్జన్యం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. శ్రీనివాసరావుపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేసిన పోలీసులు న్యాయవాది శ్రీనివాసరావుపై కేసు నమోదు చేశారు. న్యాయవాది శ్రీనివాసరావు మంగళగిరికి చెందిన ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డిలకు సన్నిహితుడని తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details