ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నదే టీడీపీ లక్ష్యం: లోకేశ్​ - Nara Lokesh Zoom Meet in Doctors

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 15, 2024, 9:24 AM IST

TDP Leader Nara Lokesh Zoom Meet with Doctors: రాష్ట్రంలో ప్రతి పౌరుడికి ఆర్థిక భారం పడకుండా మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలన్నది తెలుగుదేశం పార్టీ విధానమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ స్పష్టం చేశారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దశల వారీగా యూనివర్సల్ హెల్త్ కేర్ విధానాన్ని అమల్లోకి తీసుకోస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను లోకేశ్​ అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఆరోగ్యంపై చైతన్యం తీసుకువస్తామని కేరళ తరహాలో నర్సింగ్ విద్యను ప్రోత్సహిస్తామని తెలిపారు. ప్రజలను చైతన్యవంతం చేయడంలో డాక్టర్లు కీలకపాత్ర వహించాలని పిలుపునిచ్చారు. 

యూనివర్సల్ హెల్త్ కవరేజి సౌకర్యం కల్పించాలని, హెల్త్ బడ్జెట్​ను పెంచాల్సిన అవసరం ఉందని డాక్టర్లు లోకేశ్​కు తెలిపారు. 80 శాతానికి పైగా ప్రజలకు సేవలందిస్తున్న చిన్న, మధ్య తరహా ఆసుపత్రుల లైసెన్సింగ్ విధానాన్ని సరళీకరించాలని వైద్యులు కోరారు. మధ్య తరగతి ప్రజల ఆరోగ్యం కోసం ప్రత్యేక ఇన్సూరెన్స్​ను అమలు చేయాలని వైద్యులు విజ్ఞప్తి చేశారు. ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్నస్పెషలిస్టు వైద్యులు, సిబ్బంది పోస్టులను భర్తీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.  

ABOUT THE AUTHOR

...view details