ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఓట్ల లెక్కింపు సందర్భంగా అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు: ఎస్పీ హర్షవర్దన్​ రాజు - SP Harshavardhan Raju

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 3, 2024, 5:00 PM IST

Tirupati SP Harshavardhan Raju: ప్రజాస్వామ్య బద్దంగా నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‍ రాజు తెలిపారు. తిరుపతిలోని ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నిర్వహించే ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను  ప్రశాంతంగా నిర్వహించడానికి పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని ఎస్పీ తెలిపారు.

 ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ తెలిపారు. అందుకోసం జిల్లా వ్యాప్తంగా సుమారు 2500 మంది పోలీసులు, 300 మంది సాయుధ బలగాలతో జిల్లా అంతట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ హర్షవర్ధన్  తెలిపారు. కౌంటింగ్‍ కేంద్రం వద్ద 1800 మందితో భద్రత కల్పిస్తున్నామని వివరించారు. గత సంఘటనల దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని ఎస్పీ తెలిపారు. అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details