హైదరాబాద్లో రూ.50 లక్షల హవాలా డబ్బు స్వాధీనం - Hawala Money
🎬 Watch Now: Feature Video
Published : Mar 7, 2024, 3:46 PM IST
Rayadhurgam Police Seized Hawala Money : హైదరాబాద్ మహానగరం అక్రమ తరలింపునకు అడ్డాగా నిలుస్తోంది. ప్రతిసారి ఏదో ఒక దొంగతనాలు, స్మగ్లింగ్, హత్యలు, అక్రమ తరలింపులతో వార్తల్లో చేరుతోంది. తాజాగా లక్షల రూపాయల హవాలా డబ్బును కారులో తరలిస్తూ అడ్డంగా దొరికిపోయారు కొంతమంది.
Rs. 50 lakhs Hawala Money Sized : ఈ ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎలాంటి పత్రాలు లేకుండా నగదును మహారాష్ట్రకు చెందిన విక్రమ్ నిన్న రాత్రి 12:30 గంటల సమయంలో డబ్బు తరలిస్తున్నారన్న పక్క సమాచారంతో మాదాపూర్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు తనిఖీలు చేపట్టగా ఇన్నోవా క్రిస్టా కార్లో తరలిస్తున్న రూ. 50 లక్షల హవాలా డబ్బును స్వాధీనం చేసుకున్నారు. డబ్బుల గురించి అడగగా రియల్ ఎస్టేట్ డబ్బులు అని ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో ఎస్ఓటీ పోలీసులు రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకొని దొరికిన రూ. 50 లక్షలను ఐటీ డిపార్ట్మెంట్కు అప్పగిస్తామన్నట్లు తెలిపారు.