చాక్లెట్స్ రూపంలో గంజాయి - బీహార్ వాసి అరెస్టు - అక్రమ గంజాయిని పట్టుకున్న పోలీసులు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 14, 2024, 9:01 AM IST
Police Arrested Illegally Selling Ganja In Chocolates: రాష్ట్రంలో గంజాయిని అనేక విధాలుగా విక్రయిస్తున్నారు. సులువుగా డబ్బులు సంపాదించడం కోసం ఇటువంటి పనులకు పాల్పడి పోలీసులకు పట్టుబడుతున్నారు. అలాంటి సంఘటనే ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బూదవాడలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు బిహార్‌కు చెందిన యువకుడు రమేష్ సహాని బూదవాడ పంచాయతీ పరిధిలోని ఎల్లయ్యనగర్‌లో గ్రానైట్ కంపెనీల సమీపంలో బడ్డీకొట్టు నిర్వహిస్తున్నాడు.
కొంతకాలంగా ఇతర ప్రాంతాల నుంచి గంజాయి చాక్లెట్లు తీసుకొచ్చి ఇక్కడి పరిశ్రమల్లోని కార్మికులకు విక్రయించేవాడు. సమాచారం తెలుసుకున్న అధికారులు మంగళవారం బడ్డీకొట్టులో తనిఖీ చేయగా 3480 గ్రాముల గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వాటి విలువ రూ.10వేల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో క్వారీలు ఎక్కువగా ఉండటంతో అందులో పనిచేసే కార్మికులను టార్గెట్ చేసుకొని వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి వాటికి పాల్పడే వారి వివరాలను తెలపాలని పోలీసులు వివరించారు. సంగ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.