తెలంగాణ

telangana

ETV Bharat / videos

బోయిన్‌పల్లిలో లిక్కర్‌ లారీ బోల్తా - బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం - Liquor Lorry Overturned - LIQUOR LORRY OVERTURNED

🎬 Watch Now: Feature Video

By ETV Bharat Telangana Team

Published : May 22, 2024, 7:41 PM IST

Liquor Lorry Overturned at Hyderabad : హైదరాబాద్‌ బోయిన్‌పల్లి పీఎస్ పరిధిలోని డెయిరీ ఫాం ప్రధాన రహదారిపై మద్యం లోడుతో వెళ్తున్న వాహనం బోల్తా పడింది. టైర్ పంక్చర్‌ కావడంతో వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనం బోల్తా కొట్టగా అందులో ఉన్న లిక్కర్ బాటిళ్లు చాలావరకు కిందపడి పగిలిపోయాయి. దాదాపు రూ. 3 లక్షల విలువైన లిక్కర్ బాటిళ్లు ధ్వంసం అయినట్లు అంచనా వేస్తున్నారు. కాగా లారీ అలా బోల్తా కొట్టిందో లేదో మద్యం ప్రియులు అలా పట్టేశారు.

Liquor Lorry Road Accident : ఆ సమయంలో అటుగా వెళ్తున్న వాహనదారులు మద్యం బాక్సులను చూసి వెంటనే తమ వెహికల్స్‌ను ఆపారు. రోడ్డుపై పడిన లిక్కర్‌ బాటిళ్లను అందిన కాడికి ఎత్తుకెళ్లారు. ఇలాంటి బంపర్ ఆఫర్ మళ్లీ రాదని తలచి బాటిళ్లకు బాటిళ్లు పట్టుకెళ్లారు. ఘటన స్థలికి చేరుకున్న బోయిన్‌పల్లి పోలీసులు, ట్రాఫిక్‌కు అంతరాయం కాకుండా వాహనాన్ని అక్కడి నుంచి తొలగించారు.

ABOUT THE AUTHOR

...view details