ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో ఏరులై పారిన మద్యం - ఒక్కొక్కరికీ 500 రూపాయలు - YSRCP Liquor Cash Distribution - YSRCP LIQUOR CASH DISTRIBUTION

🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 21, 2024, 9:18 AM IST

Cash Distribution at YCP MLA Candidate Nomination: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి నామినేషన్ (Biyyapu Madhusudhan Reddy) కార్యక్రమంలో మద్యం ఏరులై పారింది. అత్యధిక జన సందోహాన్ని చూపించేందుకు ఒక్కొక్కరికి 500 రూపాయల నగదు, మద్యం బాటిల్, టీ షర్టు పంపిణీ చేశారు. పట్టణంలో వేర్వేరు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భోజనాలు ఏర్పాటు చేశారు. ఇన్నాళ్లూ బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆయన బామ్మర్ది శ్రీధర్ రెడ్డి మధ్య విభేదాలు ఉన్నట్లు ప్రజలను నమ్మించిన ఎమ్మెల్యే, నామినేషన్ ప్రక్రియలో కలిసికట్టుగా వచ్చి ర్యాలీని విజయవంతం చేసేందుకు చర్యలు చేపట్టారు. 

మధుసూదన్ రెడ్డి 12:20కి నామినేషన్ దాఖలు చేసేందుకు ముహూర్తం కుదుర్చుకోగా, పట్టణంలో నిర్వహించిన ర్యాలీ, భోజనాలు, క్రేన్లతో గజమాల ఏర్పాట్లు చేయడంతో ఆలస్యమైంది. దీంతో బియ్యపు మధుసూదన్ రెడ్డి ర్యాలీ మధ్యలోనే ప్రచార వాహనం దిగి హడావుడిగా ద్విచక్ర వాహనంపై ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేయడం విశేషం. 

ABOUT THE AUTHOR

...view details