కోనాం ప్రాజెక్టు గేట్ల నుంచి కారుతోన్న నీరు- ఆందోళనలో స్థానికులు - leakage problems in Konam reservoir - LEAKAGE PROBLEMS IN KONAM RESERVOIR
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 16, 2024, 5:17 PM IST
Konam Reservoir Water Goes Down Due to Leakages : వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఐదేళ్ల రివర్స్ పాలన పాపాలు రాష్ట్ర ప్రజలకు శాపాలుగా మారి నేటికి వేధిస్తున్నాయి. జగన్ హయాంలో సాగునీటి రంగాన్ని పూర్తిగా పక్కన పెట్టడంతో పలు ప్రాజెక్టుల నిర్వహణ కుంటుపడింది. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలపై గత ప్రభుత్వం అనుసరించిన విధానం ఎంత దయనీయ ఫలితాలనిస్తుందో పోలవరం చూస్తే తెలుస్తోంది. మరోవైపు ఉన్న ప్రాజెక్టుల నిర్వహణను కూడా గాలికి వదిలేయడం వల్ల ఆయకట్టు రైతుల పరిస్థితి వర్ణనాతీతం. అటువంటి కోవలోకే వస్తుంది అనకాపల్లి జిల్లాలోని కోనాం రిజర్వాయర్.
ఈ ప్రాజెక్టు ప్రారంభమై దాదాపు 50 సంవత్సరాలు అవుతుంది. మునుపటి ప్రభుత్వాలు ప్రాజెక్టు బాగోగులు చూశాయి. అయితే గత ఐదేళ్లలో జగన్ సర్కార్ కనీసం మరమత్తులు కూడా చేపట్టలేదు. దీంతో లీకేజీలు ఏర్పడి భారీ ఎత్తున నీరు వృథాగా దిగువకు వెళ్లిపోతుంది. ఈ కొనాం రిజర్వాయర్ కింద దాదాపుగా 14వేల ఎకరాలు భూమి సాగుచేస్తున్నారు. లీకేజీల కారణంగా భారీగా నీరు దిగువకు వెళ్లిపోతున్నాయి. దీంతో సరైన సమయంలో పంటలకు నీరు అందటం లేదని రైతులు వాపోతున్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వమైన ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.