ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

జగన్​తో జనం విసిగిపోయారు- కూటమి అభ్యర్థులకు పట్టం కట్టేందుకు సిద్దం: దుర్గేష్ - Kandula Durgesh fire on jagan

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 3, 2024, 3:50 PM IST

Kandula Durgesh fire on YCP Government : జగన్ సర్కార్​తో విసిగిపోయిన ప్రజలు కూటమి అభ్యర్థులకు పట్టం కట్టేందుకు సిద్ధమయ్యారని నిడదవోలు నియోజకవర్గ జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ అన్నారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో నిడదవోలులో పలు సమస్యలు పట్టి పీడిస్తున్నా పట్టించుకోలేదని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రాధాన్య క్రమంలో ప్రజా సమస్యలు పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీచేయడంతో కూటమికి గోదావరి జిల్లాల్లో పూర్తి జోష్ కనిపిస్తోందన్నారు. ఇక్కడి ప్రజల ఆలోచన విధానంలో మార్పు వచ్చిందని తెలిపారు.

ఇక్కడ కూటమి అభ్యర్థులందరూ సంపూర్ణంగా సహకరిస్తున్నారు. దీనివల్లే నియోజకవర్గంలో అన్ని పార్టీలు ఒకే నినాదంతో ముందుకు వెళుతున్నాయని వెల్లడించారు. ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో నరకం అనుభవించిన ప్రజలు విసుగెత్తిపోయారు. అలాగే పూర్తిగా నిర్లక్ష్యాానికి గురైన నిడదవోలు నియోజకవర్గంలో ప్రజలు నాయకత్వ మార్పు కోరుకుంటున్నారని వివరించారు. ప్రస్తుతం ఎక్కడికి వెళ్లిన ప్రజల నుంచి స్పందన విపరీతంగా ఉంది. ఇక్కడ ఉన్న రైతు భరోసా కేంద్రాలు అన్నదాతలను మోసం చేయాడానికి మాత్రమే ఉన్నాయని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో వందపడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసి గాలికి వదిలేశారని మండిపడ్డారు. కాబట్టి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని కందుల దుర్గేష్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details