LIVE : రవీంద్ర భారతిలో జి.వెంకటస్వామి జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి - CM Revanth Reddy Live - CM REVANTH REDDY LIVE
Published : Oct 5, 2024, 1:59 PM IST
|Updated : Oct 5, 2024, 2:18 PM IST
CM Revanth Reddy Live : కాకా వెంకటస్వామి 95వ జయంతి వేడుకలను హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బడుగు బలహీన వర్గాల కోసం కాకా వెంకటస్వామి ఎంతగానో కృషి చేశారని రేవంత్ రెడ్డి కొనియాడారు. ఆయన రాష్ట్రానికి చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తమ ప్రభుత్వం కూడా బడుగు బలహీన వర్గాల వారి సంక్షేమం కోసం కృషి చేస్తుందని రేవంత్ స్పష్టం చేశారు. అన్ని వర్గాల అభ్యన్నతే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నెం1గా నిలపాలనేదే తన లక్ష్యమని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని తమ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి చెందేవిధంగా కృషి చేస్తున్నామన్నారు. కావాలనే తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు బురద జల్లుతున్నారని రేవంత్ మండిపడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. కాకా వెంకటస్వామి జయంతి సందర్భంగా సభను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు.
Last Updated : Oct 5, 2024, 2:18 PM IST