పీవీకి భారతరత్నపై ఆయన స్పందిస్తారు - అయితే 'నెక్స్ట్ సీఎం విజయసాయిరెడ్డా జగన్?!' - PV Bharat Ratna
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 9, 2024, 4:37 PM IST
|Updated : Feb 9, 2024, 5:33 PM IST
CM Jagan Did Not Respond To Bharat Ratna to PV Narasimha Rao: మాజీ ప్రధాని పీవీకి భారతరత్న రావడంపై ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులంతా స్పందిస్తున్నారు. పీవీ ముందు చూపుతో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడం ద్వారా ఇప్పుడు పొందుతున్న ఫలితాలను తెలియజేస్తూ, మీడియాతో పాటుగా ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇదిలా ఉండగా, బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ఇప్పటికే దిల్లీలో పర్యటిస్తున్న ఏపీ సీఎం జగన్ పీవీకి భారతరత్న రావడంపై మౌనం వహించడం గమనార్హం.
పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న ప్రకటించడంపై స్పందన తెలియజేసేందుకు ముఖ్యమంత్రి జగన్ నిరాకరించారు. మీడియా అంటేనే పరుగులు తీసే జగన్ పార్లమెంటు సాక్షిగా మరో సారి అదే సీన్ రిపీట్ చేశారు. తెలుగు వ్యక్తికి భారతరత్న రావడంపై మీ స్పందన ఏమిటని జాతీయ మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా జగన్ తనదైన హావభావాలు పలికిస్తూ కాన్వాయ్ దిశగా వేగంగా కదిలారు. చివరగా 'విజయసాయిరెడ్డి మాట్లాడతారు' అంటూ బదులిచ్చారు. దీంతో ఓ మీడియా ప్రతినిధి 'నెక్స్ట్ సీఎం విజయసాయిరెడ్డా?' అంటూ వ్యంగంగా బదులిచ్చారు. దిల్లీకి వెళ్లిన సీఎం జగన్ పార్లమెంట్ భవనం నుంచి బయటికి వస్తున్నప్పుడు ఈ పరిణామం చోటుచేసుకుంది. తెలుగు వ్యక్తికి భారతరత్న రావడంపై మాట్లాడమంటూ విలేకర్లు పదేపదే అడిగినా జగన్ పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.