నెల్లూరు జిల్లాలో భారీ సిమెంట్ కుంభకోణం - పక్కదారి పట్టిన నాలుగు వేల సిమెంటు బస్తాలు - Cement Fraud in Nellore district
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 1, 2024, 5:14 PM IST
Cement Fraud in Nellore District : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జగనన్న ఇళ్ల నిర్మాణాల్లో భారీ సిమెంట్ కుంభకోణం వెలుగు చూసింది. జిల్లాలోని సంగం మండలంలో గృహ నిర్మాణాల లబ్ధిదారుల కోసం పంపిణీ చేయాల్సిన సుమారు 4000 సిమెంట్ బస్తాలు పక్కదారి పట్టాయి. ఇందులో హౌసింగ్ ఏఈ కరీముల్లాతో పాటు వైఎస్సార్సీపీ నాయకులు, కాంట్రాక్టర్లు ఉన్నారు. వీరంత పథకం ప్రకారమే సిమెంట్‌ను దారి మళ్లించారు. ఈ కుంభకోణంపై ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఎంపీడీవోకి ఫిర్యాదు చేయడంతో ఈ సిమెంటు బాగోతం బయటపడింది.
Cement Issue in Sangam Mandal : సంగం మండలానికి కొత్తగా వచ్చిన ఇంఛార్జి హౌసింగ్ డీఈ షేక్ ముక్తార్ భాషా మాట్లాడుతూ, తాను ఇక్కడికి రాక ముందే బహూళ ప్రయోజన సౌకర్య గోదాములో 17180 బస్తాలు ఉన్నాయని తెలిపారు. వాటిలో దాదాపుగా 4000 బస్తాలకు ఎటువంటి రికార్డులు లేవని వివరించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారుల ఆదేశాలతో విచారణ చేస్తున్నట్టు వెల్లడించారు. విచారణలో వాస్తవాలు తేలితే చర్యలు తప్పవని హెచ్చరించారు.