ఆసియాలోనే తొలి మహిళా సేఫ్టీ ప్రొఫెషనల్‌గా గుర్తింపు - ఆ యువతి ప్రస్తానం చూద్దామా? - Sathvika Gupta Exclusive interview - SATHVIKA GUPTA EXCLUSIVE INTERVIEW
🎬 Watch Now: Feature Video
Published : May 26, 2024, 10:11 PM IST
|Updated : May 26, 2024, 10:16 PM IST
Asia First Female Fire Safety Officer Sathvika Gupta : అగ్ని ప్రమాదాలు జరిగినపుడు మరింత ఆస్తి నష్టం జరగకుండ చూడటం ఎంత ముఖ్యమో బాధితుల ప్రాణాలు రక్షించడం ఇంకా ముఖ్యం. ఎక్కడో చిక్కుకుపోయినవారిని కనిపెట్టి తీసుకురావడం అంత ఆషామాషీ కాదు. సవాళ్లతో కూడిన ఈ రంగంలో మహిళల సంఖ్య చాలా తక్కువ. నిత్యం ప్రమాదాలలో మరణిస్తున్న వారిని చూసి ఆమె మనసు చలించిపోయింది. ప్రమాదం ఎప్పుడు ఎటు నుంచి పొంచుకొస్తుందో తెలియదు.
అందుకే ముందే తగు జాగ్రత్తలు పాటిస్తే చాలా వరకు ప్రాణ, ఆస్తి నష్టాలు తగ్గించవచ్చు అని ఆ యువతి చెప్తోంది. తన వంతు సామాజిక బాధ్యతతో ప్రజలకు అవగాహన కల్పించాలని కంకణం కట్టుకుంది. ఈ విభాగంలో సేఫ్టీ ఆఫీసర్ గా రాణిస్తున్నారు హైదరాబాద్ కు చెందిన సాత్వికా గుప్తా. ఆసియాలోనే తొలి మహిళా సేఫ్టీ ప్రొఫెషనల్ గా ఆమె గుర్తింపు పొందారు. ఇప్పుడు ఈ రంగంపై మహిళలు ఏ విధంగా రాణించాలని, ఆ రంగంలో ఆమె ఎదుర్కొన్న కష్టాలను ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.