Samsung Enterprise Edition:శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. కంపెనీ తన 'గెలాక్సీ S24', 'గెలాక్సీ S24 అల్ట్రా' మొబైల్స్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్‌ను తీసుకొచ్చింది. ఈ ఎంటర్ప్రైజ్ ఎడిషన్‌లో విశేషం ఏంటంటే.. ఇవి రెండూ 3-సంవత్సరాల డివైజ్ వారంటీతో పాటు ఏడేళ్ల పాటు ఫర్మ్‌వేర్ అప్‌డేట్లతో వస్తున్నాయి. అంతేకాక ఈ మొబైల్స్‌లో 'గెలాక్సీ ఏఐ' ఫీచర్లతో ఒక సంవత్సరం నాక్స్ సూట్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది.
ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్:కంపెనీ ఈ రెండు మొబైల్స్‌పై మూడు సంవత్సరాల వారంటీని అందిస్తుంది. అంతేకాక ఏడాది పాటు డివైజ్ సేఫ్టీ, ఎంటర్ప్రైజ్ మొబిలిటీ మేనేజ్‌మెంట్ (EMM) కోసం 'గెలాక్సీ ఏఐ' ఫీచర్లతో ఒక సంవత్సరం నాక్స్ సూట్ (Knox Suite) సబ్‌స్క్రిప్షన్ అందిస్తుంది. ఎంటర్ప్రైజ్ కస్టమర్‌లు రెండో సంవత్సరం నుంచి 50 శాతం తగ్గింపు ధరతో నాక్స్ సూట్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందొచ్చు.
కంపెనీ వీటికి ఏడేళ్ల OS అప్‌డేట్‌లు కూడా అందిస్తామని ప్రకటించింది. అంతేకాకుండా ఈ మొబైల్స్గూగుల్ సర్కిల్ టు సెర్చ్, లైవ్ ట్రాన్స్‌లేట్, ఇంటర్‌ప్రెటర్, ట్రాన్స్క్రిప్ట్ అసిస్ట్, చాట్ అసిస్ట్ వంటి 'గెలాక్సీ AI' ఫీచర్లను కూడా కలిగి ఉంటాయి.
'గెలాక్సీ S24' మోడల్ ఫీచర్లు:
- డిస్ప్లే:6.2-అంగుళాల ఫుల్ HD+
- బ్యాటరీ:4,000 mAh
- కెమెరా సెటప్:ఈ మొబైల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50MP ప్రైమరీ వైడ్ సెన్సార్, 12MP అల్ట్రావైడ్ సెన్సార్, 10MP టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి.