తెలంగాణ

telangana

ETV Bharat / technology

స్టైలిష్ లుక్, దిమ్మతిరిగే ఫీచర్లు.. టయోటా నయా మోడల్ భలే ఉందిగా..! - 2025 TOYOTA CAMRY INDIA LAUNCH

రేపే భారత మార్కెట్లోకి టయోటా క్యామ్రీ- దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?

New-generation Toyota Camry
New-generation Toyota Camry (Photo Credit- Toyota Kirloskar Motor)

By ETV Bharat Tech Team

Published : Dec 10, 2024, 5:19 PM IST

2025 Toyota Camry India Launch:ఇండియన్ మార్కెట్లోకి మరో లగ్జరీ కారు ఎంట్రీ ఇవ్వబోతోంది. టయోటా కిర్లోస్కర్ మోటార్ భారతదేశంలో తన ప్రీమియం సెడాన్ కారును విడుదల చేయనుంది. ఈ కారు ఏడాది క్రితమే విదేశీ మార్కెట్లో రిలీజ్ అయి మంచి ప్రజాదరణ పొందింది. దీంతో ఈ కారును కంపెనీ భారత మార్కెట్లోకి కూడా తీసుకువచ్చేందుకు రెడీ అయింది. ఈ నేపథ్యంలో కంపెనీ దీని అధికారిక టీజర్​ను విడుదల చేసింది. ఈ సందర్భంగా దీనిపై మరిన్ని వివరాలు మీకోసం.

టయోటా క్యామ్రీ రిలీజ్ ఎప్పుడు?: సమాచారం ప్రకారం..టొయోటా కిర్లోస్కర్ మోటార్ ఈ కారును డిసెంబర్ 11, 2024న రిలీజ్ చేసేందుకు రెడీ అయింది. అంటే కంపెనీ రేపే దీన్ని ఇండియన్ మార్కెట్లో లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఎక్స్​టీరియర్:ఈ టయోటా క్యామ్రీ కారు సరికొత్త డిజైన్​తో రానుంది. ఈ కారు స్టైల్, డిజైన్ దాని ప్రీవియస్ మోడల్ కంటే చాలా భిన్నంగా ఉంటుంది. అంతేకాక దీనిలో హై-టెక్ ఫీచర్లతో సహా అనేక మార్పులు చేశారు. దీనిలోని రివైజ్డ్ ఫ్రంట్ ఫాసియా, హారిజాంటల్ స్లాట్లతో వైడ్ అండ్ అగ్రెసివ్ గ్రిల్, ​C-షేప్డ్​ LED DRLs, కొత్త మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్ సెట్, డోర్ ప్యానెల్స్​పై షార్ప్ క్రీసెస్, రీడిజైన్డ్ LED టెయిల్‌ల్యాంప్స్​ అండ్ హెడ్ ల్యాంపులతో పాటు లార్జ్ పనోరమిక్ సన్​రూఫ్​ వంటి వాటిని అప్​డేట్ చేశారు. ఈ కారు ముందు భాగంలో గ్రిల్​.. తేనెపట్టు ఆకారంలో ఉన్న ప్యాటెర్న్​ను కలిగి ఉంది.

ఇంటీరియర్:దీని ఇంటీరియర్ గురించి చెప్పాలంటే.. ఇది డ్యూయల్-టోన్ థీమ్, త్రీ-స్పోక్ మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, 10-అంగుళాల హెడ్-అప్ డిస్‌ప్లే, 12.3-అంగుళాల స్క్రీన్​తో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, మల్టీ- -జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లతో అధునాతన ADAS సూట్​తో వస్తుంది.

పవర్​ట్రెయిన్:ఈ కొత్త టయోటా క్యామ్రీ.. 2.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో హైబ్రిడ్ మోటార్ సెటప్‌తో వస్తుంది. ఎలక్ట్రిక్మోటార్‌తో కూడిన ఈ ఇంజిన్ సెటప్ రెండు పవర్-ట్యూన్లతో వస్తుంది. ఇందులో మొదటిది FWD (Front-Wheel Drive). ఇది 222bhp శక్తిని ఇస్తుంది. ఇక రెండోది AWD (All-wheel drive). ఇది 229bhp పవర్​ని అందిస్తుంది. రెండింటితోనూ ఈ ఇంజిన్ e-CVT ట్రాన్స్‌మిషన్​తో వస్తుంది.

క్రేజీ ఫీచర్లతో రూ.10వేలకే 5G స్మార్ట్​ఫోన్!- ఎక్కడో తెలుసా?

వారెవ్వా.. గూగుల్ 'విల్లో' వెరీ పవర్​ఫుల్ బాస్- దీని స్పీడ్​కి ఎవరైనా సలాం కొట్టాల్సిందే!

ఈ ఫోన్లలో గేమ్స్ ఆడితే.. ఆ మజానే వేరు.. నాన్​స్టాప్ గేమింగ్​కు బెస్ట్ మొబైల్స్ ఇవే!

ABOUT THE AUTHOR

...view details