How to Activate Parental Supervision Feature :ఇన్‌స్టాగ్రామ్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రతి ఫోన్లో ఈ యాప్ ఉంటుంది. ఈ సోషల్ మీడియాలో యావత్ యువత మునిగితేలుతోంది. అయితే.. పిల్లలు కూడా ఇందులో కొట్టుకుపోతున్నారు. అందుకే.. పరిస్థితి అదుపు తప్పకుండా ఇన్‌స్టాగ్రామ్ ఓ ఫీచర్‌ను పట్టుకొచ్చింది..!
దీని ద్వారా.. పిల్లలు ఎలాంటి కంటెంట్ చూస్తున్నారో.. పేరెంట్స్ తెలుసుకోవచ్చు. అదే "పేరెంటల్ సూపర్ విజన్". ఈ ఫీచర్ సాయంతో తల్లిదండ్రులు తమ పిల్లలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంత సమయం కేటాయిస్తున్నారు? ఏయే ఖాతాలను ఫాలో అవుతున్నారో తెలుసుకోవచ్చు. మరి.. ఈ ఫీచర్‌ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
- పేరెంటల్ సూపర్‌విజన్ ఫీచర్ కావాలనుకునే వారు.. ఈ ఫీచర్ యాక్టివ్ చేయాలని తమ పిల్లల ఖాతాల నుంచి ఇన్‌స్టాగ్రామ్‌ను కోరాలి.
- ఆ తర్వాత తల్లిదండ్రులు తమ పిల్లలు ఉపయోగించే ఖాతాలకు పేరెంటల్ సూపర్‌విజన్ రిక్వెస్ట్ పంపాల్సి ఉంటుంది.
- సదరు రిక్వెస్ట్‌ను పిల్లలు ఓకే చేస్తే.. తల్లిదండ్రులు తమ పిల్లల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు ఎలా ఉపయోగిస్తున్నారనేది తెలుసుకోవచ్చు.
- ఈ ఫీచర్ వల్ల.. ఇతరుల అకౌంట్ గురించి ఎప్పుడైనా పిల్లలు ఫిర్యాదు చేస్తే.. తల్లిదండ్రులకు నోటిఫికేషన్ వస్తుంది.
Take A Break తెలుసా..?
పేరెంటల్ సూపర్ విజన్తోపాటు ఇన్‌స్టాగ్రామ్ మరో ఫీచర్‌ను కూడా తీసుకొచ్చింది. అదే.. టేక్ ఏ బ్రేక్! మెజారిటీ జనాలు ఒక్కసారి ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెడితే.. ఎంతసేపటి తర్వాత బయటకు వస్తారో వారికే తెలియదు. నిమిషాల నుంచి గంటల దాకా ఇన్‌స్టా వాడుతూనే ఉంటారు. ఈ పరిస్థితి మితిమీరుతోందని గుర్తించిన ఇన్‌స్టా.. స్వీయ నియంత్రణ కోసం ‘టేక్ ఏ బ్రేక్’ (Take A Break) ఫీచర్ తెచ్చింది.
- యూజర్ ఎక్కువ సేపట్నుంచి ఇన్‌స్టాగ్రామ్ చూస్తున్నట్లయితే.. ఫోన్ స్క్రీన్‌పైన "టేక్ ఏ బ్రేక్" అనే పాప్-అప్ మెసేజ్ కనిపిస్తుంది.
- దానిపై క్లిక్ చేస్తే.. ఎంత సమయం బ్రేక్ తీసుకోవాలనే దానికి సంబంధించి టైమ్ లిమిట్స్ కనిపిస్తాయి.
- టైమ్ సెలెక్ట్ చేసిన తర్వాత కొన్ని సూచనలు చేస్తుంది.
- అందులో టేక్ ఏ డీప్ బ్రీత్, మీరు ఏం ఆలోచిస్తున్నారో రాయమని, మీకు నచ్చిన పాటలు వినమని, టు-డు లిస్ట్‌లోని పనులు పూర్తి చేయమని ఇన్‌స్టాగ్రామ్ సూచిస్తుంది.
యాక్టివిటీ కూడా తెలుసుకోవచ్చు..
- ఇన్‌స్టాలో పిల్లలు ఎంత సమయం వెచ్చిస్తున్నారో ఇలా తెలుసుకోండి..
- ముందుగా ఇన్‌స్టా ఖాతాలో ప్రొఫైల్ ఓపెన్ చేయండి.
- తర్వాత పైనే ఉన్న మెనూ బార్ ఓపెన్ చేసి.. యాక్టివిటీ (Your activity) ఆప్షన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది.
- రోజు వారీగా మొత్తం వారంలో ఇన్‌స్టాగ్రామ్‌ను ఎంతసేపు వినియోగించారనే వివరాలు స్క్రీన్‌పైన డిస్ప్లే అవుతాయి.
ఇన్‌స్టాగ్రామ్‌లో డబ్బులు సంపాదించాలా? టాప్-6 స్ట్రాటజీస్ ఇవే!
ఇన్‌స్టాగ్రామ్‌లో స్క్రీన్‌షాట్ తీస్తే - ఆ విషయం అవతలి వ్యక్తికి తెలుస్తుందా?