ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దేవుడి మాన్యం కబ్జా - లే అవుట్ చేసి రిజిస్ట్రేషన్​ చేయించిన వైఎస్సార్సీపీ నేత - దేవుని మాన్యాన్నివైసీపీ నేత ఆక్రమణ

YSRCP Leader Occupying God Land in Anantapur District: అనంతపురం జిల్లాలో కబ్జాల పర్వం కొనసాగుతోంది. కోట్ల విలువైన దేవస్థాన భూముల కబ్జాకు వైసీపీ యువనేత తెరలేపారు. ఆలయ ఆవరణలో రూ.10 కోట్లపైగా విలువైన ఖాళీ స్థలంపై వైసీపీ నేత కన్ను పడింది. ఆలయ భూమిని లేఅవుట్​గా నమ్మించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ప్లాట్లుగా విక్రయించి 5కోట్ల రూపాయల సొమ్ము చేసుకున్నాడు. అధికారం పోయేలోపు మిగిలిన దేవుడి మాన్యాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

YSRCP_Leader_Occupying_God_Land_in_Anantapur_District
YSRCP_Leader_Occupying_God_Land_in_Anantapur_District

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 6, 2024, 1:18 PM IST

Updated : Feb 6, 2024, 4:05 PM IST

YSRCP Leader Occupying God Land in Anantapur District: దేవుడి భూమిని సైతం వైసీపీ నాయకులు వదలడం లేదు. ఏదైనా, ఎక్కడైనా తమకెంటి అని భూమి కనిపిస్తే గద్దల్లా వాలిపోతున్నారు. కొండలు, గుట్టలతో పాటు ప్రభుత్వ స్థలాలు, అసైన్డ్ భూములు ఇలా దేన్ని వదిలిపెట్టకుండా ఆక్రమణల (Land Occupy) పర్వం కొనసాగిస్తున్నారు. అధికారం ఉండగానే సొమ్ము చేసుకోవాలి అనే యోచనలో అధికార పార్టీ నేతలు నడుచుకుంటున్నారు.

దేవుడి మాన్యం కబ్జా - లే అవుట్ చేసి రిజిస్ట్రేషన్​ చేయించిన వైఎస్సార్సీపీ నేత

Temple Land Kabja: "బడైనా.. గుడైనా.. డోంట్​ కేర్​.. మా కన్ను పడితే.."

Temple Land Was Encroached Four Years Ago: వైసీపీ యువ నాయకుడు ఏకంగా ఆలయ భూమికే ఎసరు పెట్టాడు. ఆలయ భూమిని నాలుగేళ్ల క్రితం ఆక్రమించినా ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లా ఉరవకొండ బళ్లారి రోడ్డులో ఉన్న వీరభద్రస్వామి ఆలయ భూమిని వైసీపీ నేత ఆక్రమించి లేఅవుట్ (Layout) వేశాడు. బినామీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి భూమిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం దేవుడి మాన్యం విలువ రూ. 10 కోట్లకు పైనే పలుకుతోంది. ఇదంతా ఉరవకొండ రెవెన్యూ అధికారులకుసమక్షంలోనే జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


'మేం మంత్రి అనుచరులం - ఈ భూమి మాది ఎవరైనా అడ్డొస్తే లేపేస్తాం'

563 సర్వే నెంబరులో వీరభద్రస్వామి ఆలయ భూమి ఉంది. దానిపై యువ నాయకుడు కన్నేశాడు. ఆలయ భూమి లేఅవుట్​గా నమ్మించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఎవరికి అనుమానం రాకుండా అనంతపురం గ్రామీణ సబ్​రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగించారు. నలుగురు బినామీలను ముందుపెట్టి తతంగం నడిపించారు. కొంత మంది అమాయకుల్ని నమ్మించి ప్లాట్లు విక్రయించారు. ఇప్పటి వరకు సూమారు రూ. 5 కోట్ల వరకు జేబులో వేసుకున్నట్లు తెలుస్తోంది. పదవి కాలం ముగిసేలోపు మిగిలిన దేవుడి మాన్యాన్ని ఆక్రమించేందుకు వైసీపీ యువనేత ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

హైదరాబాద్​కు చెందిన వరుణ్ యాదవ్ వైసీపీ యువ నాయకుడికి స్నేహితుడు. గతంలో కమ్మూరు పరిధిలోని ఓ మహిళకు చెందిన 12 ఎకరాల భూమిని నకిలీ ఆధార్ కార్డు సృష్టించి వీరిద్దరూ కాజేశారు. మహిళ భూమిని నకిలీ పత్రాలతో కాజేసిన కేసులో వైసీపీ యువ నాయకుడు, బినామీ వరుణ్‌ ముద్దాయిలుగా ఉన్నారు. ఈ కేసులో వరుణ్ యాదవ్ జైలుకు వెళ్లి వచ్చాడు. ప్రస్తుతం వీరభద్రస్వామి ఆలయ భూమి ఆక్రమణలోనూ అతడిని ముందుపెట్టి వ్యవహారం నడిపించారు. ముందుగా ఆలయ భూమిని బినామీ పేరుతో ఆన్​లైన్​లో ఎక్కించారు. తర్వాత అతని నుంచి వరుణ్ యాదవ్ కొన్నట్లు దస్త్రాలు(Documents) సృష్టించారు. అనంతరం ఆలయ భూమి లేఅవుట్​​గా మార్చి విక్రయాలు ప్రారంభించారు.


వైఎస్సార్సీపీ నేతల భూ కబ్జా: చంపేస్తానంటూ బెదిరింపులు

Last Updated : Feb 6, 2024, 4:05 PM IST

ABOUT THE AUTHOR

...view details