Human TRAFFICKING in Visakha: బాలికల అక్రమ రవాణాను విశాఖ రైల్వే పోలీసులు గుర్తించారు. రైలులో బాలికలను తరలిస్తుండగా అనుమానం వచ్చిన పోలీసులు విచారించగా విషయం వెలుగు చూసింది. ఇద్దరు మేజర్లు సహా 11 మంది బాలికలను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. బాలికలను తరలిస్తున్న రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి బాలికలను తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇద్దరు మేజర్లు సహా 11 మంది బాలికలను విశాఖ రైల్వే పోలీసులు కాపాడారు.
బాలికలను తరలిస్తున్న నిందితుడు రవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి నుంచి నకిలీ ఆధార్ కార్డులు సేకరించారు. ఇప్పటివరకు 100 మందిని తరలించినట్లు విచారణలో వెల్లడైంది. బాలికలు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్‌కు చెందిన వారు కాగా, ఒడిశాలోని నవరంగపూర్ నుంచి తరలిస్తున్నట్లు గుర్తించారు. వీరిలో ఇద్దరు మేజర్లు ఉన్నారు.