High Court Orders On Pond Buffer zone And FTL :హైదరాబాద్‌లోని అన్ని చెరువులకు సంబంధించి పూర్తి పర్యవేక్షణ తమదేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. రామమ్మ చెరువు బఫర్‌జోన్‌లో ఎలాంటి నిర్మాణాలు జరగకుండా చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై బుధవారం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. హెచ్‌ఎండీఏ పరిధిలో 3 వేల 532 చెరువులు ఉన్నాయని జులైలో జరిగిన విచారణ సందర్భంగా ప్రభుత్వం తెలపగా వాటన్నింటికీ బఫర్‌జోన్, ఎఫ్టీఎల్ను నిర్ధరించాలని హైకోర్టు ఆదేశించింది.
తదుపరి విచారణ డిసెంబర్ 30కి వాయిదా :ఇవాళ విచారణకు హాజరైన హెచ్ఎండీఏ కమిషనర్ ఇప్పటివరకు 2,793 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్లు జారీ చేసినట్లుగా తెలిపారు. 530 చెరువులకు సంబంధించి తుది నోటిఫికేషన్లు పూర్తయినట్లుగా వెల్లడించారు. హైదరాబాద్ పరిధిలోని అన్ని చెరువులకు ఎఫ్‌టీఎల్(ఫుల్ ట్యాంక్ లెవల్), బఫర్ జోన్లను నిర్ధరిస్తూ తుది నోటిఫికేషన్ జారీకి 3 మాసాల సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టును కోరగా అందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. తదుపరి విచారణను డిసెంబరు 30వ తేదీకి వాయిదా వేసింది.