తెలంగాణ

telangana

ETV Bharat / state

LIVE UPDATES : శాసనసభ నిరవధిక వాయిదా - TELANGANA AQSSEMBLY LIVE UPDATES

LIVE UPDATES
LIVE UPDATES (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 21, 2024, 10:24 AM IST

Updated : Dec 21, 2024, 4:15 PM IST

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ఏడో రోజు కొనసాగుతున్నాయి. ఇవాళ కూడా ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ఉభయ సభల్లో ఎత్తివేశారు. అయితే ఈ ఉదయం 10 గంటలకు "రైతు భరోసా' విధి విధానాలపై స్వల్పకాలిక చర్చతో శాసనసభ ప్రారంభమైంది. ఇప్పటికే శాసన సభలో అమోదం పొందిన నాలుగు బిల్లులను ఇవాళ మండలిలో సంబంధిత శాఖల మంత్రులు ప్రవేశ పెడతారు. శాసన మండలిలో జీహెచ్‌ఎంసీ సవరణ బిల్లు, తెలంగాణ మున్సిపాలిటీల సవరణ బిల్లులను సీఎం రేవంత్‌ రెడ్డి ప్రవేశపెడతారు. అదే విధంగా పంచాయతీరాజ్‌ సవరణ బిల్లును పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క, భూ భారతి బిల్లును రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ప్రవేశ పెడతారు. ఆ తరువాత మండలిలో రైతు భరోసా విధి విధానాలపై లఘు చర్చ జరగనుంది.

LIVE FEED

4:04 PM, 21 Dec 2024 (IST)

  • సినిమా విడుదలకు ముందురోజు ఎలాంటి బెనిఫిట్ షోలు ఉండవు: మంత్రి కోమటిరెడ్డి
  • ఇకపై టికెట్ల రేట్ల పెంపునకు అనుమతి ఇచ్చేది లేదు: మంత్రి కోమటిరెడ్డి
  • రేవతి కుటుంబానికి పరిహారం ఇస్తామన్న అల్లు అర్జున్‌ నిలబెట్టుకోలేదు: కోమటిరెడ్డి
  • రేవతి కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటాం: కోమటిరెడ్డి
  • చనిపోయిన రేవతి కుటుంబానికి పరిహారం ఇస్తాం: మంత్రి కోమటిరెడ్డి
  • బాలుడి చికిత్సకు ప్రతీక్ ఫౌండేషన్ తరఫున సాయం చేస్తాం: మంత్రి కోమటిరెడ్డి
  • ప్రభుత్వం తరుఫున రూ.25 లక్షల ఆర్థికసాయం చేస్తాం: మంత్రి కోమటిరెడ్డి
  • శ్రీతేజ్‌ వైద్య ఖర్చులనూ ప్రభుత్వమే చెల్లిస్తుంది: మంత్రి కోమటిరెడ్డి


3:51 PM, 21 Dec 2024 (IST)

  • సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటన బాధిత కుటుంబానికి ఆర్థికసాయం
  • బాలుడి వైద్యానికి ఆర్థికసాయం ప్రకటించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
  • శ్రీతేజ్ వైద్య ఖర్చులకు రూ.25 లక్షలు ఇస్తామని మంత్రి కోమటిరెడ్డి ప్రకటన

3:31 PM, 21 Dec 2024 (IST)

  • నేను సినిమా ప్రముఖులకు ఒక విషయం స్పష్టంగా చెప్తున్నా: సీఎం
  • అమానవీయ ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు: సీఎం
  • సినిమాలు తీసుకోండి, వ్యాపారం చేసుకోండి, డబ్బులు సంపాదించుకోండి:
  • ప్రభుత్వం నుంచి రాయితీలు, ప్రోత్సాహకాలు తీసుకోండి: సీఎం
  • షూటింగ్‌లకు సంబంధించి ప్రత్యేక అనుమతులు కూడా తీసుకోండి: సీఎం
  • ప్రజల ప్రాణాలు పోతుంటే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు: సీఎం
  • నేను కుర్చీలో ఉన్నంత వరకు ఇలాంటి ఘటనలు ఉపేక్షించను: సీఎం
  • ప్రజల ప్రాణాలు పోయే ఘటనలు జరిగితే ప్రత్యేక మినహాయింపులు ఉండవు: సీఎం
  • తెలంగాణ ప్రజల ప్రాణాలు కాపాడటమే నా బాధ్యత: సీఎం
  • ప్రజలకు ఇబ్బంది కలిగించే ఎవరినీ ప్రభుత్వం వదిలిపెట్టదు: సీఎం

3:00 PM, 21 Dec 2024 (IST)

  • సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతుంది: సీఎం
  • సంధ్య థియేటర్ ఈనెల 2న చిక్కడపల్లి పీఎస్‌లో దరఖాస్తు చేశారు: సీఎం
  • ఈనెల 4న పుష్ప-2 విడుదలవుతుందని చెప్పారు: సీఎం రేవంత్‌రెడ్డి
  • ఈనెల 4న హీరో, హీరోయిన్, సినీనిర్మాణ సిబ్బంది వస్తారని అందులో పేర్కొన్నారు: సీఎం
  • బందోబస్తు కావాలని పోలీసులను థియేటర్ యాజమాన్యం కోరింది: సీఎం
  • ఈనెల 3న సంధ్య థియేటర్‌ రాసిన లేఖకు పోలీసలు రాతపూర్వక సమాధానం ఇచ్చారు: సీఎం
  • సంధ్యా థియేటర్‌కు వెళ్లి, రావడానికి ఒకే మార్గం ఉందని చెప్పారు: సీఎం
  • సంధ్య థియేటర్‌ చుట్టు పక్కల ఇతర థియేటర్లు, రెస్టారెంట్లు ఉన్నాయి: సీఎం
  • సంధ్య థియేటర్‌ పరిసరాల పరిస్థితుల దృష్ట్యా సెలబ్రిటీలకు భద్రత ఇచ్చే పరిస్థితి లేదని చెప్పారు: సీఎం
  • వచ్చే జనాలను నియంత్రించడం సాధ్యం కాదని చెప్పారు: సీఎం
  • సంధ్య థియేటర్ యాజమాన్యం ఇచ్చిన లేఖను తిరస్కరించాం: సీఎం
  • ఈనెల 2న సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ ఇస్తే.. 3న తిరస్కరించారు: సీఎం
  • వాహనం రూఫ్‌టాఫ్ నుంచి చేతులు ఊపుతా ర్యాలీ చేశారు: సీఎం

1:45 PM, 21 Dec 2024 (IST)

సీఎం :

రూ.7,11,911 లక్షల కోట్ల అప్పులను మాకు ఇచ్చి వెళ్లారు

60 ఏళ్లలో 16 మంది సీఎంలు చేసిన అప్పు రూ. 72 వేల కోట్లే తొమ్మిదిన్నర ఏళ్ల కేసీఆర్‌ పాలనలో రూ.7 లక్షల కోట్ల అప్పు చేశారు

కేసీఆర్‌ పదేళ్లు కష్టపడి కూలేశ్వరం కట్టారు

1:37 PM, 21 Dec 2024 (IST)

సీఎం

  • ఒకేసారి రుణమాఫీ చేయలేమని కేసీఆర్ గతంలో చెప్పారు
  • ఒకేసారి రుణమాఫీ చేయాలంటే రూ.8 వేల కోట్లు కావాలన్నారు
  • ఎలాంటి పాలన చేశారో.. ఒకసారి బీఆర్‌ఎస్ చూసుకోవాలి
  • బీఆర్‌ఎస్‌ చేసిన పాపాలు చదవాల్సిన శిక్ష నాకు వచ్చింది
  • స్కిల్‌ వర్సిటీ కోసం అదానీ రూ.100 కోట్లు ఇచ్చారు
  • అదానీ ఇచ్చిన రూ.100 కోట్లపై ప్రతిపక్ష నానాయాగీ చేసింది
  • ప్రతిపక్షం యాగీ వల్ల రూ.100 కోట్లు అదానీకి తిరిగి ఇచ్చాం
  • రూ.100 కోట్లు తిరిగి ఇవ్వడం వల్ల రాష్ట్రానికి నష్టం.. నాకేం అవుతుంది: సీఎం
  • మాట తప్పని.. మడమ తిప్పని పార్టీ కాంగ్రెస్‌: సీఎం
  • సోనియా దయతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది: సీఎం
  • ప్రత్యేక తెలంగాణలో రెండుసార్లు సీఎం అయ్యారు
  • రెండుసార్లు సీఎం అయ్యి.. వందేళ్ల విధ్వంసం చేసి.. వెయ్యేళ్లకు సరిపడా సంపాదించారు

1:37 PM, 21 Dec 2024 (IST)

సీఎం 2

  • అబద్ధాలు చెప్పే సంఘానికి అధ్యక్షుడు అసెంబ్లీకి రాలేదు
  • అబద్ధాలు చెప్పే సంఘానికి ఉపాధ్యక్షుడు అసెంబ్లీకి వచ్చారు
  • గత ప్రభుత్వ హయాంలో రైతులు ఆత్మహత్యలు తగ్గించామని చెబుతున్నారు
  • రైతులు ఆత్మహత్యల్లో మహారాష్ట్ర తొలిస్థానంలో ఉంది
  • రైతులు ఆత్మహత్యల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉంది
  • బీఆర్‌ఎస్‌ హయాంలో 3 వేల మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు
  • అద్భుతాలు చేశామని ప్రతిపక్ష సభ్యులు అంటున్నారు
  • అద్భుతాలు చేసినందుకే ప్రతిపక్ష నేత సభకు రాలేకపోతున్నారు
  • అద్భుతాలు చేసినందుకు.. సమాధానం చెప్పలేక అసెంబ్లీకి రాలేదు

1:36 PM, 21 Dec 2024 (IST)

సీఎం 1

  • నిజమైన లబ్ధిదారులు ఎవరికీ అన్యాయం జరగకూడదు
  • జమీందార్లు, భూస్వాములకు రైతుబంధు ఇవ్వాలా?
  • మేం ఇచ్చాం కాబట్టి.. మీరూ రాళ్లు, గుట్టలకూ రైతుబంధు ఇవ్వాలంటున్నారు
  • బీఆర్‌ఎస్‌ను ఆదర్శంగా తీసుకోవాలని అంటున్నారు
  • బీఆర్‌ఎస్‌ను ఆదర్శంగా తీసుకొంటే మేం కూడా ప్రతిపక్షంలో ఉండేవాళ్లం
  • 2023లో అధికారం.. 2024లో డిపాజిట్లు పోయిన మీరు మాకు ఆదర్శం కాదు
  • ప్రధాన ప్రతిపక్ష నేతకంటే మంత్రి తుమ్మల సీనియర్
  • రైతుబంధు అమలుపై మంత్రివర్గ ఉపసంఘం వేశామా?
  • రైతుబంధుపై అన్ని వర్గాలతో ఉపసంఘం చర్చలు జరిపింది
  • ప్రతిపక్ష నేతల సూచనల్లో సహేతుకత కనిపిస్తే స్వీకరిస్తాం.. బేషజాలు లేవు
  • రైతులకు మేలు జరుగుతుందంటే ప్రతిపక్ష నేతల సూచనలు స్వీకరిస్తాం

1:34 PM, 21 Dec 2024 (IST)

సీఎం

  • రైతుభరోసాపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదు
  • రైతు సమాజాన్ని ఆదుకునేందుకు మా ప్రభుత్వం ముందు ఉంటుంది
  • రైతులను ఆదుకోవడమే మా ప్రభుత్వ ఆలోచన
  • రైతులకు పెట్టుబడి సహాయం ఇచ్చేందుకు రైతుబంధు తెచ్చారు
  • గత ప్రభుత్వం రైతుబంధు అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించింది
  • గత ప్రభుత్వం సాగులో లేని భూములకు రైతుబంధు ఇచ్చారు రూ.22,600 కోట్లు రైతుబంధు ద్వారా ఆయాచిత లబ్ధి చేశారు
  • రియల్‌ ఎస్టేట్, పారిశ్రామికవేత్తలకూ రైతుబంధు ఇచ్చారు
  • రాళ్లకు, గుట్టలకూ రైతుబంధు ఇద్దామా?: సీఎం రేవంత్‌రెడ్డి
  • భూముల్లో రహదారి వెళ్తే.. దానికీ రైతుబంధు జమచేశారు
  • గత ప్రభుత్వం క్రషర్ యూనిట్ల భూములకూ రైతుబంధు ఇచ్చింది
  • గత ప్రభుత్వం ఏటా రూ.3 కోట్ల ఎకరాలకు రైతుబంధు ఇచ్చారు
  • గత ప్రభుత్వం ఏటా రూ.15 వేల కోట్ల రైతుబంధు ఇచ్చింది
  • దొంగ పాస్‌పుస్తకాలు తయారు చేసుకొని రైతుబంధు లబ్ధి పొందారు
  • కీలక అంశమైన రైతుబంధుపై చర్చ జరిగితే ప్రతిపక్ష నేత సలహాలు ఇస్తారనుకున్నా

12:37 PM, 21 Dec 2024 (IST)

2014 ముందు రైతులే లేనట్లు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మాట్లాడుతున్నాయి : పాయల్ శంకర్

పాయల్‌ శంకర్

  • 2014 ముందు రైతులే లేనట్లు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మాట్లాడుతున్నాయి
  • మేమే వ్యవసాయాన్ని సృష్టించినట్లు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మాట్లాడుతున్నాయి
  • వ్యవసాయం రాష్ట్రానికి సంబంధించిన అంశం
  • రాష్ట్రంలో ఉన్న రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది
  • వ్యవసాయానికి కేంద్రం చేసిన సాయం గురించి ఎవరూ మాట్లాడట్లేదు
  • రాజకీయాలంటే దూషించుకోవడమే అనేలా మాట్లాడుతున్నారు
  • ఈ రోజు పత్తికి మార్కెట్‌లో ధర లేదు
  • సీసీఐ పత్తి కొనకుంటే లక్షల మంది రైతులు రోడ్డున పడేవారు
  • కేంద్రం సాయంతో 1.20 కోట్ల టన్నుల పత్తిని సీసీఐ తీసుకుంది
  • సీసీఐ కొనుగోలు చేసిన పత్తిలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక్క రూపాయి లేదు
  • పీఎం కిసాన్‌ ద్వారా వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో కేంద్రం ఇస్తోంది
  • మోదీ ఇస్తున్న పైసలు వస్తున్నాయి.. రాష్ట్రం నుంచి మాత్రం పైసలు రావట్లేదని రైతులు మాట్లాడుకుంటున్నారు
  • జనవరి నుంచి రైతుభరోసా ఇస్తామన్నారు... సంతోషం
  • టమాట ధర రూ.15కి పడిపోయింది
  • రైతు ఈనాటికీ సంతోషంగా లేడు
  • ఐదెకరాలున్న రైతు ఏడాది కష్టపడితే రూ.50 వేలు కూడా మిగలట్లేదు
  • రైతుల పిల్లలు కార్పొరేట్‌ స్కూల్‌లో చదివినా.. ఆస్పత్రికి వెళ్లినా 90 శాతం భారం ప్రభుత్వమే భరించాలి

12:20 PM, 21 Dec 2024 (IST)

సీతక్క

  • రాష్ట్రంలో రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్‌ఎస్‌ది: సీతక్క
  • కౌలు రైతులకు రైతుబంధు ఎందుకని మీరు అనలేదా?: సీతక్క
  • సాగులేని భూములకు కూడా రైతుబంధు ఇచ్చారు: సీతక్క
  • మీరు ఇచ్చింది రైతుబంధు కాదు.. పట్టా పెట్టుబడి: సీతక్క
  • పట్టా ఉన్నవారికే రైతుబంధు ఇచ్చారు: సీతక్క
  • భూమిలేని పేద రైతులకు పదేళ్లలో మీరు ఏమిచ్చారు: సీతక్క
  • ఫామ్‌హౌస్‌లో ఉన్నవారికి కూడా రైతుభరోసా ఇవ్వాలా?: సీతక్క

12:08 PM, 21 Dec 2024 (IST)

కేటీఆర్

  • రైతులు, కౌలు రైతులకు, రైతు కూలీలకు రైతు భరోసా ఇస్తామన్నారు: కేటీఆర్
  • ఇచ్చిన హామీ ప్రకారం రైతుభరోసా అమలు చేయాలి: కేటీఆర్
  • రైతుబంధు ఎగ్గొట్టాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉంది: కేటీఆర్
  • కోతలకు సిద్ధమయ్యాకే మంత్రివర్గ ఉపసంఘం వేశారు: కేటీఆర్
  • రైతుబంధు విషయంలో ప్రభుత్వం కాలక్షేపం చేస్తుంది: కేటీఆర్
  • వానకాలం రైతుబంధు ఎగ్గొట్టారు: కేటీఆర్
  • భవిష్యత్‌లో రైతుబంధును ఎగ్గొట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది: కేటీఆర్
  • రాష్ట్రంలో కోటి పైచిలుకు పాన్‌కార్డులు ఉన్నాయి: కేటీఆర్
  • కొండారెడ్డిపల్లె, కొడంగల్, సిరిసిల్ల.. ఏ ఊరికైనా వెళ్దాం..: కేటీఆర్
  • 100 శాతం రుణమాఫీ చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా: కేటీఆర్
  • రైతులకు కూడా పాన్‌కార్డులు ఉన్నాయి.. రైతు భరోసా కోత విధిస్తారని వాళ్లు భయపడుతున్నారు

11:49 AM, 21 Dec 2024 (IST)

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

  • ఏఎంఆర్‌పీ ఎన్టీఆర్‌ మొదలుపెడితే డిస్ట్రిబ్యూషన్‌ కాలువలు రూ.400 కోట్లతో నేను వైఎస్‌ఆర్‌ హయాంలో పూర్తి చేశాం
  • నాడు మేము కాలువలు పూర్తి చేస్తే ఇప్పుడు పంటలు అంది వస్తున్నాయి
  • బీఆర్‌ఎస్‌ పాలనలో జగన్‌తో మిత్రత్వం చేసి క్రాప్‌ హాలిడేలు పెట్టారు
  • నాడు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచితే సొంత పార్టీలో ఉన్నా వైఎస్‌ఆర్‌తో పోరాడా
  • పులిచింతల మూడో పంటకు నీళ్లు ఇస్తే పోరాడా
  • నల్గొండ జిల్లాకు బీఆర్‌ఎస్‌ పాలనలో నీళ్లు ఇచ్చి ఉంటే జిల్లాలో భారీ మెజార్టీతో గెలిచాం
  • సీఎం.. మూసీ ప్రక్షాళన చేసి బతుకునిద్దామంటే అడ్డుపడుతున్నారు
  • మేం బతకాలని లేదు.. బావ, బావమరుదులు కలిసి నల్గొండ ప్రజలకు విషమిచ్చి చంపండి
  • రూ.6 వేల కోట్లతో మిషన్‌ భగీరథ టెండర్లు పిలిచి డ్రా చేసుకున్నారు
  • బీఆర్‌ఎస్‌ పాలనలో ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు
  • రేవంత్‌రెడ్డి పుణ్యాన ప్రాజెక్టులు పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తాం
  • బీఆర్‌ఎస్‌, బీజేపీ అడ్డుపడినా మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం

11:26 AM, 21 Dec 2024 (IST)

  • రైతుబంధు మీద కాంగ్రెస్‌ విపరీతమైన దుష్ప్రచారం చేసింది: కేటీఆర్
  • రైతు బతుకును మార్చిన గేమ్‌ఛేంజర్‌ రైతుబంధు: కేటీఆర్
  • రైతుబంధు అనేక రాష్ట్రాలు కాపీ కొట్టాయి
  • వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారా? లేదా? అని గతంలో మా మెడపై కత్తి పెట్టారు
  • గతంలో మా మెడపై కత్తి పెట్టినా మోటార్లకు మీటర్లు పెట్టబోమని చెప్పాం
  • రూ.30 వేల కోట్ల అదనపు రుణాన్ని కూడా వదులుకున్నాం

10:47 AM, 21 Dec 2024 (IST)

  • ధరణి పోర్టల్‌లోని భూమి హక్కుల రికార్డుల ఆధారంగా రైతుబంధు ఇచ్చారు: తుమ్మల
  • భూమి ఉన్నవారు సాగు చేసినా.. చేయకపోయినా రైతుబంధుకు అర్హులయ్యారు: తుమ్మల
  • రైతుబంధు అమలు చేసిన విధానంలో వ్యవసాయశాఖకు లబ్ధిదారుల పేర్లను మార్చడం..
  • సీసీఎల్‌ఏ నుంచి అందిన భూవిస్తీర్ణంలో మార్పులు చేయడానికి అనుమతి లేదు: తుమ్మల
  • పట్టాదారుల బ్యాంకు ఖాతాలను సేకరించి రైతుబంధు పోర్టల్‌ను అప్‌డేట్‌ చేస్తున్నాం: తుమ్మల
  • 12 సీజన్లలో రూ.80,453.41 కోట్లు రైతు బంధు విడుదల చేశారు
  • 2023-24లో రూ.7625.14 కోట్లు కాంగ్రెస్‌ ప్రభుత్వం చెల్లించింది
  • 2018 వరకు పంటల సర్వే రెవెన్యూ శాఖ ద్వారా జరిగేది

10:28 AM, 21 Dec 2024 (IST)

  • శాసనమండలిలో భూ భారతి బిల్లపై చర్చ
  • భూ భారతి చట్టం అమల్లోకి రాకముందే ప్రకటన వచ్చిందన్న విపక్ష నేతలు
  • ఇలాంటి తప్పులు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించిన మండలి ఛైర్మన్
  • ప్రొటోకాల్‌ ఉల్లంఘనలు జరుగుతున్నాయని విపక్ష సభ్యుల ఫిర్యాదులు
  • అమలులో అలసత్వం ఉంటుందన్న మండలి ఛైర్మన్
  • ప్రభుత్వ కార్యక్రమాలకు ఎమ్మెల్సీలను ఆహ్వానించాల్సిందే: ఛైర్మన్
  • ప్రోటోకాల్‌పై ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించిన ఛైర్మన్

10:21 AM, 21 Dec 2024 (IST)

  • అసెంబ్లీ పది నిమిషాలు ఆలస్యంగా ప్రారంభం కావడంపై బీఆర్‌ఎస్‌ అభ్యంతరం
  • సభ సమయపాలన పాటించాలి: హరీశ్‌రావు
  • ప్రతి రోజూ ఆలస్యంగా సభ ప్రారంభమవుతుంది: హరీశ్‌రావు
  • అందరికి ఆదర్శంగా మనం ఉండాలి: హరీశ్‌రావు
  • సభ ఇలా ఆలస్యంగా జరిగితే ఎలా?: హరీశ్‌రావు
Last Updated : Dec 21, 2024, 4:15 PM IST

ABOUT THE AUTHOR

...view details