Pattabhi allegations on CM Jagan:జగన్ బస్సుయాత్ర ప్రజాధరణ లేక తుస్సుయాత్రగా మారిందని తెలుగుదేశం నేత పట్టాభి రామ్ విమర్శించారు. రాష్ర్టవ్యాప్తంగా ఈ ఐదేళ్లలో వైకాపా నేతలు భారీ అవినీతికి పాల్పడ్డారని, ఆ వాటా లెక్కలు తేల్చుకోవడానికే ప్రతి జిల్లాలోనూ సీఎం జగన్ బస్సుయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. బొత్స కుటుంబం దోచిందెంత, జగన్‌కు రావాల్సిందెంత అనేది ఇవాళ విజయనగరం జిల్లా పర్యటనలో తేల్చుకుంటారని పట్టాభి అన్నారు.
బొత్స సత్తిబాబు, చిన్న శీను, అప్పల నరసయ్య, అప్పల నాయుడు తదితర నేతలు దోచిన లెక్కలు తేల్చి, తన వాటా వసూలుకే జగన్ రెడ్డి విజయనగరం వచ్చాడని పట్టాభి రామ్ ధ్వజమెత్తారు. వైజాగ్ స్టీల్‌కు క్యాప్టివ్ మైన్ గా ఉన్న గర్భామ్ మాంగనీస్ మైన్‌ను సత్తిబాబు కుటుంబం కబ్జా చేసిందని ఆయన ఆరోపించారు. 2022 అక్టోబర్‌లో గర్భామ్ మంగనీస్ మైన్ లీజును విశాఖ ఉక్కు పరిశ్రమకు ఎందుకు రెన్యువల్ చేయలేదని ప్రశ్నించారు. పుంగనూరు పుడింగి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సత్తిబాబులు విశాఖ స్టీల్ కు మాంగనీస్ మైన్ లీజును పొడిగించకుండా తొక్కిపెట్టారని మండిపడ్డారు. మైన్ గడువు ముగియడంతో వైజాగ్ స్టీల్ బహిరంగ మార్కెట్‌లో మాంగనీస్ టన్ను 14-15 వేలు పెట్టి కొనాల్సి వస్తోందని విశాఖ స్టీల్ వారు మాంగనీస్ మైన్ లీజు రెన్యువల్ చేయాలని 12 లేఖలు రాసినా జగన్ రెడ్డి పట్టించుకోలేదని విమర్శించారు.
జగన్ పాలనలో పది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంపు - ప్రజలపై రూ.27 వేల కోట్లు భారం: పట్టాభి - PATTABHI FIRES ON CM JAGAN