TDP leader Ganta Srinivas Rao Reacts On liquor scandal: వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మద్యపాన నిషేధంహామీని తుంగలో తొక్కిందని మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ మేరకురాష్ట్రంలో జరుగుతున్న మద్యం అక్రమాలపై ఎక్స్ (ట్విట్టర్) ద్వారా స్పందించారు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయానికి సంబంధించి లెక్కలు, పత్రాలపై ప్రశ్నించారు. మద్యపాన నిషేధంఅంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్, మద్యం ద్వారా వచ్చే ఆదాయన్ని చూపిస్తూ 15 ఏళ్లకు బ్యాంకు నుంచి అప్పులు తెచ్చారని గంటా ఆరోపించారు.
జగనాసుర కుట్రలో భాగంగానే చంద్రబాబును ఏ3గా చేర్చారు: నారా లోకేశ్
లెక్కా పత్రాలు ఏమైనా ఉన్నాయా?: టీ స్టాల్ దగ్గర నుంచి, కిళ్ళీ కొట్టు వరకు అన్నిచోట్ల డిజిటల్ పేమెంట్ ప్రపంచం నడుస్తుందని కానీ, ఏపీలో మాత్రం జగన్మోహన్ రెడ్డి నడిపే మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్ కు నో ఛాన్స్! అని మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు అన్నారు. అంతా క్యాష్ మయం! ఏంటి ఈ రహస్యం? ఈ క్యాష్ అంతా ఎక్కడికి చేరుతుంది, వీటికి లెక్కా పత్రాలు ఏమైనా ఉన్నాయా జగనన్న అని ప్రశ్నించారు. ఇంత విచ్చలవిడిగా నాసిరకం మద్యం అమ్మి, పేదోడిని దోపిడీ చేసిన ఇలాంటి ముఖ్యమంత్రి చరిత్ర తిరగేసినా దొరకరేమో అంటూ గంటా ఎద్దేవా చేశారు. రేట్లు సంగతి దేవుడెరుగు, బ్రాండ్‌లన్నీ బ్రాంతియేలా మార్చారన్నారు. ప్రీమియం పేరును మాయం చేశారు, నిఖార్సైన సరుకుకు ఏనాడో స్వస్తి పలికారని విమర్శించారు.
లెక్కలు తారుమారు చేసేందుకు వెబ్సైట్ నుంచి లిక్కర్ డేటా తొలగింపు: అచ్చెన్నాయుడు