Police Bomb Mock Drill at Ongole : అది ఏపీలోని ఒంగోలు బస్టాండ్. అక్కడ పెద్ద సంఖ్యలో ప్రయాణికులు వేచి చూస్తున్నారు. బస్సు ఎక్కేవాళ్లు ఎక్కుతున్నారు. దిగేవాళ్లు దిగుతున్నారు. స్నాక్స్ అమ్మేవాళ్లు అమ్ముతున్నారు. ఇలా బస్టాండ్ ఎప్పటి లాగానే చాలా రద్దీగా ఉంది. ఇంతలో ఏమైందో ఏమో కానీ పరుగు పరుగున పోలీస్ అధికారులు, సిబ్బంది అక్కడకు వచ్చారు. జాగిలాలతో తనిఖీలు చేపట్టారు. ప్రత్యేక పరికరాలతో బస్టాండ్‌లో వెతుకులాట ప్రారంభించారు. అనుమానాస్పదంగా కనిపించిన ఓ సంచిని స్వాధీనం చేసుకున్నారు. అందులో పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించి బయటకు తీశారు. దాంతో అక్కడున్న ప్రయాణికుల్లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. బస్టాండులో ఎవరో బాంబు అమర్చారంటూ భయాందోళనకు గురయ్యారు. అనంతరం ప్రత్యేక సూట్ ధరించిన కొంత మంది అధికారులు అక్కడికి చేరుకున్నారు. బ్యాగ్ నుంచి పేలుడు పదార్థాలు అత్యంత జాగ్రత్తగా బయటకు తీసి, తీగలు కత్తిరించి పేలకుండా నిర్వీర్యం చేశారు.
మళ్లీ పాఠశాలలకు బాంబు బెదిరింపులు - వారంలో రెండోసారి - పోలీసులు హై అలెర్ట్