ORR Helpline In Hyderabad :హైదరాబాద్ ట్రాఫిక్ రద్దీని దాటి గమ్యం చేరాలంటే గతంలో ఒకప్పుడు దాదాపు 3 గంటలు సమయం పట్టేది. ఆ సమస్యకు శాశ్వత పరిష్కారంగా హైదరాబాద్(Hyderabad) చుట్టూ అన్ని ప్రాంతాలకు సులువుగా చేరుకునేలా 8 వరుసల్లో 158 కిలోమీటలర్ల మేర బాహ్య వలయ రహదారిని నిర్మించారు. తద్వారా వాహన చోదకులు ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా సులువుగా గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. అయితే కొందరు రహదారి ప్రమాణాలు పాటించకపోవడంతో ఇటీవల ఈ ఓఓఆర్‌పై ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. వాటిని నివారించడం సహా చోదకులకు సహాయం అందించేందుకు హెచ్‌ఎమ్‌డీఏ చర్యలు చేపట్టింది.
Outer Ring Road In Hyderabad : బాహ్యవలయ రహదారిపై ప్రయాణించే సమయంలో ఏదైనా సమస్య వస్తే ఏం చేయాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు అదే పరిస్థితి. డీజిల్, పెట్రోల్ అయిపోయినా కొందరు స్నేహితులకు ఫోన్ చేసి తెప్పించుకుంటారు. అలాంటివి చేయకుండా వెంటనే 14449 అనే టోల్ ఫ్రీ నెంబర్‌కి ఫోన్‌చేస్తే 15 నిముషాల్లో సాయం అందిస్తారు. చోదకుని వద్ద ఫోన్ లేకపోతే ప్రతీ కిలోమీటరుకు ఓ ఏసీఎస్ బాక్స్‌ను అమర్చారు. తద్వారా సమాచారాన్ని తెలియజేసినా వెంటనే పెట్రోలింగ్ బృందం వచ్చి సాయం అందిస్తారు.
Vechicles Speed In crease On ORR : ఓఆర్ఆర్పై 100 కాదంట.. ఇక నుంచి 120KMPH వెళ్లొచ్చు
"అవుటర్ రింగ్ రోడ్‌పైన వాహనదారులకు అవగాహన లేదు. ప్రమాదాలు జరిగినప్పుడు, పెట్రోల్, డీజిల్ ఖాళీ అయినప్పుడు వాళ్ల బంధువులకు, స్నేహితులకు ఫోన్ చేస్తారు. అలా కాకుండా వెంటనే ఓఆర్‌ఆర్ ప్రత్యేకంగా 14449కి టోల్ ఫ్రీ నెంబర్‌కు ఏర్పాటు చేశాం. ఈ నంబర్‌కు కాల్ చేస్తే 15 నిమిషాల్లో ఏ ఇతర సాయమైనా అందిస్తాం." - కిట్టు, ఓఆర్‌ఆర్ గుత్తేదారు ప్రతినిధి