ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పరీక్షా పే చర్చ'లో ఒంగోలు విద్యార్థినితోప్రధాని మాటామంతీ - ONGOLE STUDENT CHIT CHAT WITH PM

ప్రధానమంత్రి 'పరీక్షా పే చర్చ'లో ఒంగోలు విద్యార్థిని

ongole_student_chit_chat_with_prime_minister
ongole_student_chit_chat_with_prime_minister (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 28, 2025, 11:40 AM IST

Ongole Student Chit Chat With Prime Minister :ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించిన 'పరీక్షా పే చర్చ'లో రాష్ట్రం నుంచి ఒంగోలు పీవీఆర్‌ మున్సిపల్‌ బాలికోన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని నగరికంటి సాయి సహస్ర పాల్గొన్నారు. దిల్లీలో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె ప్రధానితో ముచ్చటించారు. చర్చలో భాగంగా ప్రకృతి, పచ్చదనానికి సంబంధించి ప్రధానిని ఆమె ప్రశ్నించారు.

మోదీ స్పందిస్తూ ప్రకృతిలో మొక్క తల్లితో సమానమన్నారు. మొక్కలు నాటి సంరక్షించుకోవడం అంటే తల్లిని గౌరవించుకోవడమేనని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఏక్‌ పేడ్‌ మాకే నామ్‌’ కార్యక్రమం గురించి వివరించారు. విద్యార్థినితో పాటు పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయురాలు సహాయకురాలిగా దిల్లీ వెళ్లారు.

ABOUT THE AUTHOR

...view details