MP Purandeswari About Abusing Posts in Social Media :సామాజిక మాద్యమాల వేదికగా మహిళా ప్రజా ప్రతినిధులను మానసికంగా కుంగదీసేలా పోస్టులు పెట్టించడం, ప్రచారం చేయడం మెంటల్ వయోలెన్స్‌గా పరిగణించాల్సి ఉంటుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ధ్వజమెత్తారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పురందేశ్వరి మాట్లాడుతూ ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఇటీవల జరిగిన కామన్‌వెల్త్ సమావేశా గురించి ప్రస్థావించారు.
తదుపరి కామన్‌వెల్త్ సమావేశం బహమాస్‌లో జరపాలని నిర్ణయించారన్నారు. కామన్‌వెల్త్ సమావేశాల్లో మహిళల అసమానత్వం, మహిళా ప్రజాప్రతినిధుల పట్ల దురాచారాలు ఇతర అంశాలపై చర్చించామని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు మహిళా ప్రజాప్రతినిధులతో చర్చిస్తూ- సమస్యల పరిష్కానికి వీలుగా శిక్షణ తరగతులు నిర్వహించి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేలా చూడాల్సి ఉందన్నారు. కామన్‌వెల్త్ సమావేశాల్లో పాల్గొన్న వివిధ దేశాల నుంచి సైబర్ నేరాల నియంత్రణకు సాంకేతిక సహకారం కూడా ఒకరి నుంచి ఒకరు అందిపుచ్చుకునే అంశాలపైనా చర్చ జరిగిందన్నారు.
మహిళలను మానసికంగా కుంగదీసేలా పోస్టులు 'మెంటల్ వయోలెన్స్' : ఎంపీ పురందేశ్వరి (ETV Bharat) వైఎస్సార్సీపీ ఆగడాలు ఇక సాగవు: పీతల సుజాత
BJP Leader Bhanuprakash reddy Fires on Jagan :గత ఐదేళ్లల్లో సోషల్ మీడియా పోస్టులను ప్రోత్సహించింది జగన్ కాదా అని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి ప్రశ్నించారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు, వీడియోలు పెట్టినా ఎందుకు స్పందించలేదని నిలదీశారు. అడ్డుకోవాల్సిన వైఎస్సార్సీపీ పెద్దలు నీచమైన పోస్టులను ప్రోత్సహించారని ఇప్పుడు కూటమి ప్రభుత్వం చట్ట పరంగా చర్యలు తీసుకుంటోందని చెప్పారు. టీటీడీ పరిధిలో వివిధ విభాగాల్లో పనిచేస్తోన్న అన్యమతస్తుల సేవలు దేవస్థానానికి అక్కర్లేదని స్పష్టం చేశారు.
ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటున్న మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహనరెడ్డికి నియమ నిబంధనలు తెలుసా? అని ఎద్దేవా చేశారు. సీఎం హోదా అయినా, ప్రతిపక్ష హోదా అయినా ప్రజలే ఇవ్వాలని అన్నారు. గతంలో సీఎం హోదా ఇస్తే అడ్డగోలుగా పాలన చేశారని, దీంతో ప్రతిపక్ష హోదా కూడా దండగ అని ప్రజలు ఆయన్ని 11స్థానాలకు పరిమితం చేశారని దుయ్యబట్టారు. ఇప్పుడు జగన్ కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమేనని తన నియోజకవర్గ సమస్యల గురించి శాసనసభలో మాట్లాడేందుకు శాసనసభ సమావేశాలకు వెళ్లకుండా బయట ఉంటూ విమర్శలు చేస్తుండడంపై నియోజకవర్గ ప్రజలు జగన్‌ను గట్టిగా నిలదీయాలన్నారు. ప్రజలు బుద్ధి చెప్పినా శాసనసభకు వెళ్లేది లేదని మాట్లాడుతుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
సజ్జల భార్గవ్‌రెడ్డిపై అట్రాసిటీ కేసు - మరో ఇద్దరిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు