Model Schools Admissions Last Date : గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్య తరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసినవే ఆదర్శ పాఠశాలలు. ఈ బడుల్లో 2025- 26 సంవత్సరానికి సంబంధించి 6 -10 తరగుతుల్లో అడ్మిషన్లకు ఇప్పటికే ప్రకటన విడుదలైంది. ప్రవేశ ప్రరీక్షకు దరఖాస్తు చేసేందుకు ఈ నెల 28వరకే గడువు ఇచ్చుండగా తాజాగా దానిని మార్చి 10వరకు పొగిడించారు. ఒకసారి అడ్మిషన్ పొందితే ఇంటర్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్, బాలికలకు వసతి సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు.
ఎలా దరఖాస్తు చేయాలంటే : ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి చదువుతున్నవిద్యార్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. https:///telanganams.cgg.gov.in వెబ్‌సైట్‌లో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసీ విద్యార్థులకు రూ.200, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్‌సీ విభాగాలకు చెందిన విద్యార్థులకు రూ.125 చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంటాయి. ఏప్రిల్ 13న దరఖాస్తు చేసిన పాఠశాలలోనే ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఉదయం 10-12 వరకు 6వ తరగతి, మధ్యాహ్నం 2-4 వరకు 7-10 తరగతుల వారికి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. సమయం తక్కువగా ఉన్నందున విద్యార్థుల తల్లిదండ్రులు త్వరగా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
వృత్తి విద్య కోర్సులు చదవొచ్చు :6వ తరగతిలో ప్రవేశం పొందిన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఏదైనా వృత్తివిద్య కోర్సు చదివే అవకాశముంది. మొత్తం 26 రకాల(బ్యూటీషియన్, రిటైల్, ఎలక్ట్రానిక్స్, ఐటీ, అగ్రికల్చర్, టూరిజం, టైలరింగ్, హెల్త్‌కేర్, డేటా ఎంట్రీ, మగ్గం వర్క్ తదితర) కోర్సులు ఉన్నాయి. స్థానిక అవసరాల దృష్ట్యా రెండింటిని ఎంచుకునేందుకు గతంలో అవకాశం కల్పించారు. పాఠశాలలు ఎంపిక చేసిన కోర్సుల్లో విద్యార్థులు తమకు నచ్చిన ఏదో కోర్సు ఎంచుకొని చదవొచ్చు.