తెలంగాణ

telangana

ETV Bharat / state

రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్​ పవర్​ ప్లాంట్ : డిప్యూటీ సీఎం - Bhatti on Ramagundam Power plant - BHATTI ON RAMAGUNDAM POWER PLANT

Deputy CM Bhatti Vikramarka on Power Plant : రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్తు పవర్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించినట్లు వెల్లడించారు. ఇవాళ రామగుండం బీ పవర్‌హౌస్‌ పర్యటనలో భాగంగా మంత్రులు భట్టి, శ్రీధర్​బాబు స్థలాలను పరిశీలించారు.

Bhatti on Thermal Power Plant
Bhatti on Power Plant (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 31, 2024, 2:30 PM IST

Updated : Aug 31, 2024, 3:51 PM IST

Deputy CM Bhatti Visit Ramagundam Thermal Power Plant :రామగుండంలో మూతపడ్డ బీ పవర్​ హౌస్​ 62.5 మెగావాట్ల విద్యుత్​ ప్లాంట్​ స్థానంలో 800 మెగావాట్ల పవర్​ ప్రాజెక్టును నిర్మించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పవర్​ ప్రాజెక్టుపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ మేరకు రామగుండంలో మంత్రులు శ్రీధర్​ బాబు, పొన్నం ప్రభాకర్​తో కలిసి పర్యటించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బీ పవర్​ హౌస్​ను సందర్శించి పరిశీలించారు. పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ ద్వారా అధికారులు బి పవర్​ హౌస్​ గురించి వివరించారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

అనంతరం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, చారిత్రాత్మకమైన పవర్​ ప్రాజెక్టు 50 ఏళ్ల క్రితం ఏర్పడి ఈ ప్రాంతానికి వెలుగునిచ్చిందని తెలిపారు. సాగునీటిని కూడా తీసుకువచ్చిన ప్రాజెక్టు, కాలం చెల్లడంతో మూసివేసే పరిస్థితికి వచ్చిందని అన్నారు. భావోద్వేగమైన పరిస్థితులతో ముడిపడి ఉన్న పవర్​ ప్రాజెక్టుపై సీఎం రేవంత్​ రెడ్డితో ఉమ్మడి జిల్లాల ప్రతినిధులు చర్చించామని పేర్కొన్నారు. ఈ క్రమంలో 800 మెగావాట్ల విద్యుత్​ పవర్​ ప్లాంట్​ను ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చామని స్పష్టం చేశారు.

సింగరేణి, జెన్​కో సంయుక్త వెంచర్ : ఇందుకు సంబంధించి కొద్ది రోజుల్లోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వివరించారు. సింగరేణి, జెన్​కో సంయుక్త వెంచర్​గా పవర్​ ప్రాజెక్టు ప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు. అందరి కోరిక మేరకు అతి త్వరలోనే పవర్​ ప్రాజెక్టు టెండర్లు పిలుస్తామని హామీ ఇచ్చారు. భూసేకరణపై ప్రతిపాదన త్వరగా పంపించాలని అధికారులను కోరారు. ఇందిరమ్మ రాజ్యం, ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

"రామగుండంలో 800 మెగావాట్ల పవర్​ ప్లాంట్​ను ఏర్పాటు చేస్తాం. కొద్ది రోజుల్లోనే పవర్​ ప్రాజెక్టుపై విధానపరమైన నిర్ణయం తీసుకున్నాం. సింగరేణి, జెన్​కో జాయింట్​గా పవర్​ ప్రాజెక్టు ప్రారంభించే దిశగా చర్యలు చేపడతాం. అతి త్వరలోనే పవర్​ ప్రాజెక్టు టెండర్లు పిలుస్తాం. భూసేకరణపై ప్రతిపాదన త్వరగా పంపించాలని అధికారులను కోరాం."- భట్టి విక్రమార్క, ఉపముఖ్యమంత్రి

రామగుండంలో మరో 1300 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి రంగం సిద్ధం - నేడు స్థలాల పరిశీలన - Ministers Visit for Power Plant

రామగుండం విద్యుత్‌ కేంద్రం ఆధునికీకరణకు డిమాండ్ - కొత్త ప్లాంటు ఏర్పాటుకు ప్రతిపాదన!

Last Updated : Aug 31, 2024, 3:51 PM IST

ABOUT THE AUTHOR

...view details